News September 5, 2024
గురువు పాత్ర అత్యున్నతమైనది: సీతక్క
విద్యార్థికి దశ, దిశను చూపించే గురువు పాత్ర సమాజంలో అత్యున్నతమైనదని మంత్రి సీతక్క అన్నారు. నేడు ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చదువు మాత్రమే అన్ని రకాల అణచివేతలు, నిర్బంధాల నుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తుందని అన్నారు. విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని కొనియాడారు.
Similar News
News November 17, 2024
WGL: నిరుద్యోగులకు ఈనెల 20న జాబ్ మేళా
వరంగల్ జిల్లా ఉపాధి కల్పన విభాగం ఆధ్వర్యంలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఉమారాణి శనివారం తెలిపారు. హెచ్‌డిఎఫ్‌సిలో 50, ముత్తూట్ ఫిన్ కార్ప్‌లో 100, సర్వాగ్రామ్ ఫైనాన్స్‌లో 15 ఖాళీల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ వరంగల్ ఐటిఐ బాయ్స్ క్యాంపస్‌కు రావాలన్నారు.
News November 16, 2024
WGL: సీఎం పర్యటన పనులను పరిశీలించిన ఉమ్మడి జిల్లా కలెక్టర్లు
ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాల కలెక్టర్లు ప్రావిణ్య, డాక్టర్ సత్య శారదా, దివాకర టీఎస్, రిజ్వాన్ బాషా షేక్, రాహుల్ శర్మ, GWMC అశ్విని తానాజీ వాకడే శనివారం పరిశీలించారు. సీఎం పర్యటన రూట్ మ్యాప్‌ను పరిశీలించారు. పర్యటన కు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
News November 16, 2024
హనుమకొండ జిల్లాలో చిరుత కలకలం!
హనుమకొండ జిల్లాలో చిరుత కలకలం సృష్టించింది. పరకాల మండలం రాజుపేట పంటపొలాల్లో చిరుత సంచరించినట్లు రైతులు అనుమానానిస్తున్నారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని పరిశోధిస్తున్నారు.