News September 5, 2024
కొత్తగూడెం: ఎదురుకాల్పుల్లో కానిస్టేబుళ్లకు గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో గ్రీవెన్స్ పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లచ్చన్న సహా దళానికి చెందిన ఐదుగురు మావోయిస్టులు మృతిచెందగా.. ఇద్దరు గ్రీవెన్స్ కానిస్టేబుళ్లకు గాయాలు కాగా వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వారం నుంచి లచ్చన్న దళం పినపాక మండలంలో సంచరిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
Similar News
News November 4, 2025
మాన్యువల్ స్కావెంజింగ్ రహిత జిల్లాగా ఖమ్మం: కలెక్టర్

సుప్రీంకోర్ట్ ఆదేశాలతో జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్ల పరిశీలన చేపట్టినట్లు, ఖమ్మం జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు కనుగొనలేదని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం జిల్లా మాన్యువల్ స్కావెంజింగ్ రహితంగా ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి స్కావెంజర్ల పరిశీలన నిశితంగా పరిశీలించారన్నారు.
News November 4, 2025
ఖమ్మం: ‘బీసీ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి’

2024–25 విద్యా సంవత్సరానికి బీసీ విద్యార్థుల ఉపకార వేతనాల కోసం ఈ-పాస్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి జి.జ్యోతి తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులు ఆదాయ, ఆధార్, కుల ధ్రువపత్రాలు, బ్యాంక్ పాస్‌బుక్ జతచేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ప్రింట్‌ను కలెక్టరేట్‌లోని కార్యాలయంలో సమర్పించాలని ఆమె సూచించారు.
News November 3, 2025
పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

పాఠశాలల్లో విద్యుత్, త్రాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో హెడ్ మాస్టర్‌లు, మున్సిపల్ కమీషనర్‌లతో ఆమె సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ స్కూల్స్ మంజూరైన నిధులను ప్రణాళిక ప్రకారం వినియోగించి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు.


