News September 5, 2024
భువనగిరి: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన పీఈటీ వీరేశం

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం జలాల్పూర్ గ్రామంలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న వీరేశంకు ఉపాధ్యాయ జిల్లా అవార్డుకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ జిల్లా పరిషత్ పాఠశాలల 2024 అవార్డులను ప్రకటించారు. జిల్లాలోని 25 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు అవార్డులను ప్రభుత్వం ఎంపిక చేశారు.
Similar News
News September 15, 2025
NLG: దసరా వస్తోంది.. జీతాలేవీ..?

NLG జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులకు రెండు నెలలుగా ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రామాలు స్వచ్ఛంగా ఉంచే బాధ్యతను తమపై వేసుకుని జిల్లాలో 868 జీపీల్లో పనిచేసే కార్మికుల బతుకులు దుర్భరంగా మారుతున్నాయి. తక్కువ జీతం సైతం సకాలంలో రాక కుటుంబ పోషణకు అప్పులు చేస్తున్నారు. బతుకమ్మ, దసరా పండుగ సమీపిస్తుండడంతో నూతన వస్త్రాలు, ఇతర సామగ్రి కొనుగోలు చేద్దామంటే చేతిలో డబ్బులు లేక దిక్కులు చూస్తున్నారు.
News September 15, 2025
NLG: దొడ్డు బియ్యంపై మౌనమేల?

NLG జిల్లాలోని రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. జిల్లాలో గోదాములు, MLS పాయింట్లతో పాటు రేషన్ షాపుల్లో 6వేల మెట్రిక్ టన్నుల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాటిని ఏం చేయాలో తెలియక రేషన్ డీలర్లు సైతం ఇబ్బంది పడుతున్నారు. దొడ్డు బియ్యం నుంచి పురుగులు సన్నబియ్యానికి పడుతున్నాయని లబ్ధిదారులు అంటున్నారు.
News September 15, 2025
NLG: 17 నుంచి పోషణ మాసం షురూ

ఆరోగ్యకర సమాజ నిర్మాణంతో పాటు మాతా శిశు సంరక్షణ కోసం అధికారులు పోషణ మాసం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోషణ్ అభియాన్ ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమంగా భావించి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నల్గొండ జిల్లాలోని 2,093 అంగన్వాడి కేంద్రాల్లో ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసం నిర్వహించనుంది. అంగన్వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు చూసి రిజిస్టర్లో నమోదు చేయనున్నారు.