News September 5, 2024

అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ

image

అనంతపురంలో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో డీ టీమ్ ప్లేయర్ అక్షర్ పటేల్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. 48/6తో జట్టు కష్టాల్లో ఉండగా అక్షర్ 78 బంతుల్లో 53* పరుగులతో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. ఐదుగురు ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే అవుటై నిరాశపరిచారు. డీ టీమ్ బౌలర్లలో విజయ్ కుమార్, హిమాన్షు, కాంబోజ్ చెరో రెండు వికెట్లతో రాణించారు. క్రికెట్ అభిమానులతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది.

Similar News

News July 7, 2025

పామిడిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

పామిడిలోని జగన్నాథ పద్మావతి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

News July 7, 2025

‘రాష్ట్రంలో అనంత జిల్లా మొదటి స్థానంలో నిలవాలి’

image

మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0ని రికార్డ్ సృష్టించేలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం నుంచి పేరెంట్ టీచర్స్ మీటింగ్‌పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 10న సత్య సాయి జిల్లాలో జరిగే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కి సీఎం చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉందన్నారు.

News July 7, 2025

పామిడి: ‘నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

image

పామిడి మండల కేంద్రంలోని పద్మావతి కన్వెన్షన్ హాల్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.