News September 5, 2024
సెప్టెంబర్ 29న BCCI ఏజీఎం.. NCA ప్రారంభోత్సవం

బెంగళూరులో సెప్టెంబర్ 29న బీసీసీఐ 93వ ఏజీఎం జరగనుంది. ఇప్పటికే 18 అంశాలతో కూడిన అజెండాను రాష్ట్ర సంఘాలకు పంపించారు. ఐసీసీకి వెళ్తున్న జైషా స్థానంలో మరొకర్ని ఈ సమావేశంలో ఎన్నుకొనే అవకాశం లేదని తెలిసింది. డిసెంబర్ 1న ఆయన ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటారు. అయితే ఏజీఎం రోజే జరిగే కొత్త NCA ప్రారంభోత్సవంలో బోర్డు సభ్యులు పాల్గొంటారు. కొత్త కార్యదర్శి ఎంపికకు SGM నిర్వహిస్తారని సమాచారం.
Similar News
News February 8, 2026
అరటిలో బోరాన్ లోపం లక్షణాలు – నివారణ

అరటిలో బోరాన్ ధాతు లోపం వల్ల ఆకుల ఈనెలు ఉబ్బెత్తుగా, బిరుసుగా, పెళుసుగా మారతాయి. ఆకుల తొడిమలు కురచబారి, మొవ్వులో గుబురుగా ఏర్పడతాయి. చెట్టు ఎదుగుదల తగ్గి, గెలలు చిన్నవిగా ఉండి, మొవ్వు నుంచి పూర్తిగా బయటకు రాదు. కాయలపై నిలువు పగుళ్లు ఏర్పడతాయి. పండు పరిమాణం, నాణ్యత కోల్పోతుంది. దీని నివారణకు లీటరు నీటికి బోరాక్స్/ బోరిక్ ఆమ్లం 1గ్రా. కలిపి ఆకులపై 10 రోజుల వ్యవధిలో 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి.
News February 8, 2026
AERAలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(A<
News February 8, 2026
అన్నదానం ఎంత పుణ్యమో..

అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఉడికించిన బియ్యమే కాదు, ప్రాణశక్తినిచ్చే ప్రతి ఆహారం అన్నమే. మన శరీరంలోని ‘అన్నమయ కోశం’ ఆహారం వలనే ప్రాణశక్తిని పొందుతుంది. అందుకే అన్నదానమంటే ప్రాణం దానం చేయడమే. అందుకే అన్నదానం చేయాలని శాస్త్రాలు చెబుతాయి. ఓ కోయవాడు బ్రాహ్మణుడికి ఓ రాత్రి అన్నం పెట్టిన పుణ్యంతోనే మరుజన్మలో రాకుమారుడిగా జన్మించాడు. అన్నదానానికి విచక్షణతో పనిలేదు. ఆకలితో ఉన్నవారికి పెట్టడమే పరమోత్కృష్టం.


