News September 5, 2024
మంత్రి సవిత తనయుడి మంచి మనసు
AP: విజయవాడ వరద బాధితులకు మంత్రి సవిత తనయుడు జగదీశ్ సాయి తన వంతు సాయం చేశారు. తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న రూ.21 వేలను సీఎం చంద్రబాబుకు అందించారు. చిన్న వయసులోనే సహృదయంతో ఆలోచించిన ఆ బాలుడిని అందరూ అభినందిస్తున్నారు. కాగా వారంరోజులుగా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సవిత పర్యటిస్తున్నారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఆమె చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News January 15, 2025
HYD: పోరాట యోధుడి జయంతి నేడు
1947లో ఇదే రోజు ప్రశ్నించే ఓ గొంతు జన్మించింది. 1960లో తొలిసారి ఆ కాలాతీత వ్యక్తి HYDలో అడుగుపెట్టారు. ఆయనే విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పిన జార్జ్‌రెడ్డి. 25ఏళ్ల వయసులో మార్క్స్, సిగ్మన్‌ఫ్రాయిడ్ వంటి ఫిలాసఫర్‌లను చదివేశారు. కేవలం ఉద్యమమే కాదు ఎదుటివారిని ఆలోచింపజేసే వక్త ఆయన. విద్యార్థి ఉద్యమం అంటే జార్జ్‌రెడ్డి గుర్తొచ్చేంతగా ఆయన పోరాటం.. ఓయూ నుంచే ప్రారంభం అవ్వడం హైదరాబాదీలకు గర్వకారణం.
News January 15, 2025
యుద్ధ నౌకలు జాతికి అంకితం
భారత నేవీ అమ్ములపొదిలో మూడు అత్యాధునిక యుద్ధ నౌకలు చేరాయి. INS సూరత్, INS నీలగిరి యుద్ధ నౌకలు, వాఘ్‌షీర్ జలాంతర్గామి(సబ్ మెరైన్)ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ముంబై డాక్ యార్డులో ఈ కార్యక్రమం జరిగింది. రక్షణరంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతమవుతోందని మోదీ అన్నారు. ప్రపంచంలో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని చెప్పారు.
News January 15, 2025
ఆ యాప్ బ్యాన్.. పిచ్చెక్కిపోతున్న యువత
అమెరికాలో ఈ నెల 19 నుంచి టిక్‌టాక్ బ్యాన్ కానుందనే వార్తల నేపథ్యంలో ఆ దేశ యువత ప్రత్యామ్నాయ యాప్స్‌పై ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలో చైనాకు చెందిన Xiaohongshu యాప్ అమెరికా డౌన్‌లోడ్ లిస్టులో టాప్‌లో ఉంది. 2 రోజుల్లోనే 7 లక్షల డౌన్‌లోడ్స్ వచ్చాయి. ఈ యాప్‌కు చైనాలో 300 మిలియన్ల యూజర్లు ఉన్నారు. కాగా అమెరికా జనాభాలో సగం మంది అంటే 170 మిలియన్ల మంది (17 కోట్లు) టిక్‌టాక్ వాడుతుండటం గమనార్హం.