News September 5, 2024

వరద బాధితులకు అండగా రాజమండ్రి జైలు ఖైదీలు

image

వరదల కారణంగా బెజవాడ అతలాకుతలం కాగా.. అండగా మేమున్నామంటూ పలువురు ముందుకొస్తున్నారు. ఆహారం, విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఖైదీలు సైతం వారి వంతుగా సాయం చేశారు. దాదాపు 25,000 మంది వరద బాధితులకు సరిపడా ఆహారపు పొట్లాలను జైలు పర్యవేక్షణ అధికారి రాహుల్ ఆధ్వర్యంలో గురువారం తయారు చేశారు. వాటిని 2 ప్రత్యేక వాహనాలలో విజయవాడకు పంపించినట్లు రాహుల్ తెలిపారు.

Similar News

News August 23, 2025

కాకినాడ: స్వర్ణాంధ్రాపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

ఆగస్ట్ 23న జరగనున్న స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంపై కలెక్టర్ పి.ప్రశాంతి శుక్రవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా అన్ని విభాగాధిపతులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ఈసారి ‘పరిశుభ్రత’తో పాటు వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు.

News August 22, 2025

గుడ్డిగూడెంలో ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి

image

గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామం సమీపంలో కూలీలతో వెళ్లిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పొలం పనులు ముగించుకొని ఆరుగురు కూలీలు ట్రాక్టర్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

News August 22, 2025

కాటన్ బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

image

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పడవ ప్రయాణాలు, చేపలు పట్టడం, ఈతకు దిగడం వంటివి పూర్తిగా నిషేధమని జిల్లా యంత్రాంగం తెలిపింది. సహాయం కోసం 1070, 112 నంబర్లను సంప్రదించాలని సూచించింది.