News September 5, 2024

30 రోజుల్లో రూ.9.4 కోట్లు.. మెగా ఫ్యామిలీ ఔదార్యం

image

విపత్తుల విషయంలో మెగా ఫ్యామిలీ ఔదార్యాన్ని చాటుకుంటోంది. గడచిన 30 రోజుల్లో మొత్తం రూ.9.4 కోట్లను విరాళాలిచ్చింది. తెలుగు రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ రూ.6 కోట్లు, చిరంజీవి, రామ్ చరణ్ చెరో కోటి, సాయి దుర్గ తేజ్ రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ రూ.15 లక్షలు ఇవ్వగా కేరళ వరదలకు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ.కోటి అందించారు. ఇవి కాక మెగాస్టార్ చిరంజీవి విడిగా పలు దాతృత్వ కార్యక్రమాలను చేపడుతున్నారు.

Similar News

News January 24, 2026

కాఫీ పొడితో కళకళలాడే ముఖం

image

కాఫీ తాగడం వల్ల ఆరోగ్యప్రయోజనాలతో పాటు చర్మం కూడా మెరుపులీనుతుందంటున్నారు నిపుణులు. కాఫీ పొడి ఫేస్ ప్యాక్‌లు వాడటం వల్ల ముఖంపై ఉండే మొటిమ‌లు, ముడ‌త‌లు, మచ్చ‌లు తొల‌గిపోయి చర్మం కాంతిమంతంగా మారుతుంది. * స్పూన్ కాఫీపొడిలో తేనె క‌లిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకుంటే చర్మం మెరిసిపోతుంది. ✍️మరిన్ని హెయిర్, స్కిన్ కేర్ టిప్స్ కోసం <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.

News January 24, 2026

ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

ముంబై పోర్ట్ అథారిటీ 24 జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా(ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఫిబ్రవరి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in

News January 24, 2026

రేపు ఈ పనులు చేయడం మహా పాపం: పండితులు

image

రథ సప్తమి నాడు కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అభ్యంగ స్నానం చేయకూడదని అంటున్నారు. మాంసాహారం, మద్యపానాలకు దూరంగా ఉండాలంటున్నారు. జుట్టు, గోర్లు కత్తిరించుకోవద్దని సూచిస్తున్నారు. ఈ నియమాలు అతిక్రమిస్తే దుష్ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. శాస్త్ర ప్రకారం.. సూర్యుడికి ప్రీతికరమైన ఆదివారం, సప్తమి రోజుల్లోనూ ఈ నియమాలు పాటించాలట.