News September 5, 2024

కళింగ టెంపుల్‌ సర్క్యూట్ ‘టూరిజం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

image

జిల్లాలోని పర్యాటక కేంద్రాలు, ప్రముఖ ఆలయాలను కలుపుతూ కళింగ టెంపుల్‌ సర్క్యూట్ టూరిజంను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. అందుకు తగ్గ ప్రతిపాదనలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పర్యాటక ప్రాజెక్టుల ప్రగతిపై సంబంధిత శాఖలతో కలెక్టరేట్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. కళింగ టెంపుల్ సర్క్యూట్ టూరిజం ప్రసాదం పథకంకు ఎంపిక అయ్యేలా కేంద్ర మంత్రి సహకారం తీసుకుందామన్నారు.

Similar News

News September 16, 2025

సిక్కోలు జిల్లాలో డీఎస్సీకి ఎంతమంది ఎంపికయ్యారంటే ?

image

శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ-2025లో ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 543 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 535 మంది ఎంపికయ్యారు. ఇందులో ఎస్ఏ-391, ఎస్జీటీ-144 మంది ఎంపికయ్యారని అధికారులు వెల్లడించారు. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.

News September 16, 2025

శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 55 అర్జీలు

image

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలు పునరావృతమవకుండా పూర్తి స్థాయిలో విచారణ చేసి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా SP కార్యాలయంలో ఎస్పీ గ్రీవెన్స్ నిర్వహించారు. అర్జీల్లో పౌర సంబంధాలు, కుటుంబ, ఆస్తి గొడవలు, మోసపూరితమైనవి ఇతరత్రా అంశాలపై మొత్తం 55 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ వెల్లడించారు.

News September 16, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే..!

image

➤పలాస: సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కిన ఉపాధ్యాయులు.
➤మందస: బలవంతపు భూ సేకరణ ఆపాలి
➤సీఎం సమీక్ష సమావేశంలో సిక్కోలు మంత్రి, కలెక్టర్
➤టెక్కలి: మెరుగైన సేవలకు మరో భవనం కట్టాల్సిందే
➤బూర్జ: పాఠశాలకు తాళం వేసి విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన
➤ఎల్.ఎన్ పేట: నిలిచిన నిర్మాణం.. రాకపోకలకు అంతరాయం
➤రాజమండ్రిలో రైలెక్కిన బాలుడిని పలాసలో రక్షించిన పోలీసులు