News September 5, 2024

ఆర్థిక రంగానిదే బాధ్యత: శక్తికాంత దాస్

image

లింగ అంతరాన్ని తగ్గించడంలో దేశ ఆర్థిక రంగం కీలకమని RBI గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. మహిళలకు మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించడం, వారి వ్యాపారాలకు అనుకూలమైన పథకాలను రూపొందించడం దీనికి దోహదపడతాయన్నారు. నిజమైన అభివృద్ధి చెందిన భారతదేశం పౌరుల సామాజిక‌, ఆర్థిక ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా ఆర్థిక సేవ‌లు, ఆర్థిక అక్ష‌రాస్య‌త‌ కల్పించాలన్నారు. FIBAC 2024 వార్షిక సదస్సులో ఆయన మాట్లాడారు.

Similar News

News February 4, 2025

మగవారికీ పొదుపు సంఘాలు.. అనూహ్య స్పందన

image

AP: ఇన్నాళ్లూ మహిళలకు పరిమితమైన పొదుపు సంఘాలను మెప్మా పురుషులకూ విస్తరిస్తోంది. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 2,841గ్రూపులను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకోగా నెల రోజుల్లోనే 1,028సంఘాలు ఏర్పడ్డాయి. మార్చి 31 నాటికి టార్గెట్‌ను చేరుకునేలా అధికారులు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. రోజువారీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీగార్డులకు ఆర్థిక స్వావలంబన కోసం పొదుపు సంఘాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.

News February 4, 2025

AP: మగాళ్ల పొదుపు సంఘాలు.. నిబంధనలు ఇవే

image

✒ 18-60 ఏళ్ల వయసు ఉండాలి. ఐదుగురు కలిసి ఓ గ్రూపుగా ఏర్పాటుకావొచ్చు. ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి.
✒ ప్రతినెలా కనీసం రూ.100 నుంచి రూ.1,000 వరకు పొదుపు చేయొచ్చు.
✒ 6 నెలల తర్వాత రివాల్వింగ్ ఫండ్ కింద ప్రభుత్వం ₹25K ఇస్తుంది. తర్వాత ఈ మొత్తాన్ని పెంచుకుంటూ పోతుంది.
✒ మెప్మా కార్యాలయ సిబ్బందిని కలిస్తే గ్రూపును ఏర్పాటుచేస్తారు.

News February 4, 2025

టెన్త్ ప్రీఫైనల్.. ఏపీ, టీజీ షెడ్యూల్ ఇలా

image

APలో ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు టెన్త్ క్లాస్ ప్రీఫైనల్ <<14926648>>పరీక్షలు<<>> నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. లాంగ్వేజెస్, మ్యాథ్స్ ఉ.9.30-మ.12.45 వరకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పేపర్లకు ఉ.9.30-11.30 వరకు జరుగుతాయి. TGలో మార్చి 6 నుంచి 15 వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మ.12.15-3.15 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. పిల్లలకు మ.12.15లోపే భోజనం అందించాలని ఆదేశించారు.