News September 6, 2024
సెప్టెంబర్ 6: చరిత్రలో ఈరోజు

1766: పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ డాల్టన్ జననం
1936: తెలుగు కవి అద్దేపల్లి రామమోహన రావు జననం
1949: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు రాకేశ్ రోషన్ జననం
1950: సుప్రసిద్ధ అవధాని గండ్లూరి దత్తాత్రేయశర్మ జననం
2012: రచయిత, దర్శకుడు చెరుకూరి సుమన్ మరణం
Similar News
News September 16, 2025
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

TG: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్యపై ఎఫ్ఐఆర్‌ను 2016లో హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ దీనిపై CJI జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది.
News September 16, 2025
పంట దిగుబడిని పెంచే నానో ఎరువులు

వ్యవసాయంలో చాలా కాలంగా రైతులు సంప్రదాయ యూరియా, DAPలను ఘన రూపంలో వాడుతున్నారు. వాటి స్థానంలో భారత రైతుల సహకార ఎరువుల సంస్థ(IFFCO) ద్రవరూపంలో నానో యూరియా, నానో DAPలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని సూచించిన పరిమాణంలో నీటితో కలిపి పిచికారీ చేస్తే.. ఆకులలోని పత్రరంధ్రాల ద్వారా ఎరువులోని పోషకాలను మొక్కలు 80-90 శాతం గ్రహిస్తాయి. దీని వల్ల ఎరువు నష్టం తగ్గి దిగుబడులు పెరుగుతాయని IFFCO చెబుతోంది.
News September 16, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్‌లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.