News September 6, 2024
కోలీవుడ్‌లో లైంగిక నేరాల నిందితులపై ఐదేళ్ల నిషేధం?
తమిళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడేవారిపై ఐదేళ్ల నిషేధం విధించాలని నడిగర్ సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాలీవుడ్‌లో లైంగిక వేధింపుల విషయంలో హేమ కమిటీ రిపోర్టు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో సంఘం తాజాగా భేటీ అయింది. ఫిర్యాదు రాగానే పూర్తి దర్యాప్తు చేపట్టి, నిజమని తేలితే నేరస్థులపై నిషేధం విధించాలని ఈ సమావేశంలో ప్రతిపాదించినట్లు సభ్యులు తెలిపారు.
Similar News
News February 4, 2025
నేడు పీఎం మోదీ ఏం మాట్లాడుతారు?
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సా.5 గంటలకు లోక్‌సభలో ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు బడ్జెట్‌పై మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. రేపు ఢిల్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. ఉద్యోగులకు రూ.12లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ అంశాన్ని కూడా పీఎం ప్రస్తావించే ఛాన్సుంది.
News February 4, 2025
హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్
హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. 709K.M దూరమున్న ఈ ప్రాజెక్టు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. ఈ నెల 24లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. బుల్లెట్ రైలులో 2 గంటల్లోనే HYD నుంచి ముంబై చేరుకోవచ్చు. ఆ తర్వాత హైదరాబాద్-బెంగళూర్, చెన్నై మధ్య కారిడార్లు నిర్మించాలనే ఆలోచనతో ఉంది. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ మార్గం సిద్ధమవుతోంది.
News February 4, 2025
బసవతారకం ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ టెస్టులు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా HYD బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ టెస్టులు చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల28 వరకు ఫ్రీ క్యాంప్ కొనసాగుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఉ.10 నుంచి మ.ఒంటి గంట వరకు ఉచితంగా ప్రైమరీ టెస్టులు, ఆ తర్వాత అవసరమైన పరీక్షలను తక్కువ ధరకు చేయనున్నట్లు పేర్కొన్నాయి.