News September 6, 2024

మాజీ MLA సత్యనారాయణ రాజు కన్నుమూత

image

AP: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నేత రుద్రరాజు సత్యనారాయణ రాజు(98) కన్నుమూశారు. ఈయన 1952 నుంచి 1965 వరకు యలమంచిలి మండలం చించినాడ సర్పంచ్‌గా పనిచేశారు. 1967లో ఎమ్మెల్యేగా గెలిచారు. తుది శ్వాస విడిచే వరకు సీపీఎంలోనే ఉండి ప్రజలకు సేవ చేశారు. ఆయన స్వగ్రామం చించినాడలో ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

Similar News

News February 4, 2025

1,382 మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వండి: హైకోర్టు

image

TG: DSC-2008 బీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట కలిగించింది. 1,382 మందిని ఈ నెల 10లోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల కోడ్‌తో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. 2008న ఉమ్మడి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయించింది. తమకంటే తక్కువ అర్హత కలిగినవారికి రిజర్వేషన్ ఇవ్వడంపై బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

News February 4, 2025

సూర్య కుమార్ చెత్త రికార్డు

image

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో 5.60 యావరేజ్‌తో కేవలం 28 రన్స్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అతని కెరీర్‌‌లో ఒక సిరీస్‌లో ఇదే లోయెస్ట్ యావరేజ్. 2022లో ఐర్లాండ్‌పై 7.50 AVGతో 15 రన్స్, 2024లో సౌతాఫ్రికాపై 8.66 యావరేజ్‌తో 26 పరుగులు చేశారు. సూర్య బ్యాటర్‌గా విఫలమవుతున్నా కెప్టెన్‌గా సక్సెస్ అవుతున్నారు. అతని సారథ్యంలో 23 మ్యాచ్‌లు ఆడగా భారత్ 18 గెలిచింది.

News February 4, 2025

BREAKING: రాష్ట్రంలో MLC కిడ్నాప్?

image

AP: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి, YCP తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ MLC సిపాయి సుబ్రహ్మణ్యాన్ని TDP నేతలు కిడ్నాప్ చేశారని YCP ఆరోపిస్తోంది. అర్ధరాత్రి తర్వాత ఆయనను నివాసం నుంచి తీసుకెళ్లినట్లు చెబుతోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉన్న ఆయన ఓటు కీలకం కానుంది.