News September 6, 2024

ఆకలి తీర్చిన ఆలయాలు

image

AP: విజయవాడలోని వరద బాధితుల ఆకలిని తీర్చేందుకు రాష్ట్రంలోని పలు ఆలయాలు ముందుకొచ్చాయి. ఇప్పటి వరకు ఇంద్రకీలాద్రి 2 లక్షల ఆహార ప్యాకెట్లు, 2.5 లక్షల వాటర్ బాటిళ్లు అందించింది. సింహాచలం 90వేల ఫుడ్ ప్యాకెట్స్, 50 వేల నీళ్ల బాటిళ్లు, ద్వారకా తిరుమల 31వేల ప్యాకెట్ల ఆహారం, 35వేల వాటర్ బాటిళ్లు సరఫరా చేశాయి. అలాగే అన్నవరం, అరసవల్లి, మోపిదేవి ఆలయాలు కూడా ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకున్నాయి.

Similar News

News February 4, 2025

దివ్యాంగులకు ఊరట.. ఆ నిబంధన తొలగింపు

image

రాత పరీక్షల విషయంలో దివ్యాంగులకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. పరీక్షల్లో రాత సహాయకులను పొందేందుకు 40% వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఉండాలన్న నిబంధనను తొలగించింది. ఎలాంటి ప్రామాణికం లేకుండా వికలాంగులందరూ పరీక్ష రాయడానికి స్క్రైబ్‌లను ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. 2022, ఆగస్టు 10న జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంను పునఃసమీక్షించాలని, ఆంక్షలను తొలగించాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది.

News February 4, 2025

1,382 మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వండి: హైకోర్టు

image

TG: DSC-2008 బీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట కలిగించింది. 1,382 మందిని ఈ నెల 10లోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల కోడ్‌తో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. 2008న ఉమ్మడి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయించింది. తమకంటే తక్కువ అర్హత కలిగినవారికి రిజర్వేషన్ ఇవ్వడంపై బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

News February 4, 2025

సూర్య కుమార్ చెత్త రికార్డు

image

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో 5.60 యావరేజ్‌తో కేవలం 28 రన్స్ చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అతని కెరీర్‌‌లో ఒక సిరీస్‌లో ఇదే లోయెస్ట్ యావరేజ్. 2022లో ఐర్లాండ్‌పై 7.50 AVGతో 15 రన్స్, 2024లో సౌతాఫ్రికాపై 8.66 యావరేజ్‌తో 26 పరుగులు చేశారు. సూర్య బ్యాటర్‌గా విఫలమవుతున్నా కెప్టెన్‌గా సక్సెస్ అవుతున్నారు. అతని సారథ్యంలో 23 మ్యాచ్‌లు ఆడగా భారత్ 18 గెలిచింది.