News September 6, 2024

ఇవాళ NTR జిల్లాలో స్కూళ్లకు సెలవు

image

AP: వర్షాలు తగ్గినా లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు దృష్ట్యా ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు కలెక్టర్ ఇవాళ కూడా సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు సెలవు ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని చాలా స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగతా అన్ని జిల్లాల్లో యథాతథంగా స్కూళ్లు, విద్యాసంస్థలు కొనసాగనున్నాయి.

Similar News

News February 4, 2025

అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు వేర్వేరుగా భేటీ

image

TG: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నేపథ్యంలో బీఆర్ఎస్‌ఎల్పీ, బీజేపీఎల్పీ ఎమ్మెల్యేలు వేర్వేరుగా సమావేశమయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చిస్తున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు 4 శాతం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కులగణన చేసిందని దుయ్యబట్టారు.

News February 4, 2025

రోడ్డు ప్రమాదంలో లేడీ ఎస్సై మృతి

image

TG: జగిత్యాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్వకోడూరు వద్ద బైక్‌ను ఢీకొట్టిన కారు ఆ తర్వాత చెట్టును ఢీకొనడంతో లేడీ ఎస్సై శ్వేత మరణించారు. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. శ్వేత ప్రస్తుతం జగిత్యాల పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్నారు.

News February 4, 2025

తిరుపతిలో ఉద్రిక్త పరిస్థితులు.. 144 సెక్షన్

image

AP: తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఎస్వీ వర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నికను నేటికి వాయిదా వేశారు. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని నిన్న వైసీపీ ఆరోపించగా, తాము క్షేమంగానే ఉన్నామని వారు వీడియోలు రిలీజ్ చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు 144 సెక్షన్ విధించి, భారీ భద్రత ఏర్పాటు చేశారు.

error: Content is protected !!