News September 6, 2024

రేపే వినాయక చవితి.. విగ్రహం ఏ సమయంలో పెట్టాలంటే?

image

ఈ ఏడాది చవితి తిథి సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఉంటుందని పండితులు తెలిపారు. అయితే ధృక్ సిద్ధాంతం ప్రకారం 7నే (శనివారం) వినాయక చవితి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఉ.11.03 గంటల నుంచి మ.1.30 గంటల మధ్యలో గణేశుడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం ఉందని పేర్కొన్నారు. సాయంత్రం 6.22 గంటల నుంచి రా.7.30 మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత సంకల్పం చేసుకోవచ్చని చెబుతున్నారు.

Similar News

News March 12, 2025

BIG BREAKING: దిగ్గజ క్రికెటర్ కన్నుమూత

image

HYDకు చెందిన లెజెండరీ భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ(83) USలో కన్నుమూశారు. 1967-1975 వరకు భారత జట్టుకు విశిష్ట సేవలు అందించిన ఆయన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, మీడియం పేసర్. 1971లో ఒవెల్ టెస్టు గెలిచి చరిత్ర సృష్టించిన జట్టులో సభ్యుడు. కెరీర్‌లో 29 టెస్టు మ్యాచ్‌లు ఆడి ఆయన 47 వికెట్లు పడగొట్టారు. 1959-79లో HYD రంజీ జట్టు, ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికై పటౌడీ కెప్టెన్సీలో AUSపై తొలి టెస్ట్ ఆడారు.

News March 12, 2025

త్వరలో ఆల్ పార్టీ మీటింగ్: భట్టి

image

TG: దేశంలో త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుండగా, దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో పాల్గొనాలని అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లేఖలు రాశారు. త్వరలోనే అఖిలపక్ష భేటీ తేదీ, వేదిక ప్రకటిస్తామని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

News March 12, 2025

దళితులకు ఆలయ ప్రవేశం కల్పించిన అధికారులు

image

పశ్చిమ బెంగాల్‌లోని ఓ గ్రామంలో ఆలయ ప్రవేశం కోసం దళితులు చేస్తున్న పోరాటానికి ఫలితం లభించింది. గిధగ్రాంలో ఐదుగురు దళితులను పోలీసులు ప్రత్యేక భద్రతతో శివాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం వారితో ప్రత్యేక పూజలు జరిపించారు. గ్రామంలో దాదాపు 6 శాతమున్న తమకు కులవివక్ష పేరుతో ఇన్నేళ్లుగా ఆలయ ప్రవేశం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా అధికారులకు లేఖ రాయడంతో తమకు న్యాయం జరిపించారని సంతోషం వ్యక్తం చేశారు.

error: Content is protected !!