News September 6, 2024
కాశీబుగ్గలో ఉపాధ్యాయునికి కుచ్చు టోపీ

కాశీబుగ్గలో ఉపాధ్యాయుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని పోలీసులను ఆశ్రయించారు. ఆయన కుమారుడు భువనేశ్వర్లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ‘గురువారం ఉదయం నాకు ఫోన్ చేసి, నా కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారని చెప్పారు. తాము పోలీసులమని పనిచేస్తున్నామని డబ్బిస్తే కేసు నుంచి తప్పిస్తామన్నారు. రూ.1.90 లక్షలు పంపించాను. ఇంకా రూ.50 వేలు పంపమన్నారు. అనుమానంతో ఆ నంబరకు ఫోన్ చేయగా అసలు విషయం బయటపడింది’.
Similar News
News September 19, 2025
ఇచ్ఛాపురం: 100 ఏళ్లు జీవించి..మరొకరికి వెలుగునిచ్చారు

ఇచ్ఛాపురం పట్టణ మేజిస్ట్రేట్ పరేష్ కుమార్ అమ్మమ్మ విజయలక్ష్మి (100) గురువారం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. ఓ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్స్ సుజాత, కృష్ణలు ఆమె కార్నియాను సేకరించారు.
News September 19, 2025
SKLM: 10 నుంచి 12 గంటల వరకే ఈ అవకాశం

ఇవాళ దివ్యాంగుల స్వాభిమాన్ గ్రీవెన్స్ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించనున్నట్లు జడ్పి సీఈఓ శ్రీధర్ రాజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News September 19, 2025
ఎచ్చెర్ల: యూనివర్సటిలో సంస్కృతి కోర్సు ప్రారంభం

ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటిలో సంస్కృతి కోర్సును వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ కే ఆర్ రజిని ఇవాళ ప్రారంభించారు. ఈ మేరకు జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పీఎం ఉష నిధుల ఆర్థిక సహకారంతో సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సును మొదలపెట్టామని చెప్పారు. సంస్కృతం భాష నుంచే మిగతా భాషలు వృద్ధి చెందాయని తెలియజేశారు.