News September 6, 2024
ఏపీ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలి: సురేశ్ ప్రభు

వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైందని, ఈ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. ఏపీ ఇప్పటికే భారీ అప్పులు, ఆర్థిక సవాళ్లతో కొట్టుమిట్టాడుతోంది. లక్షలాది మంది వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ వేగంగా స్పందించడం అభినందనీయం. వరద బాధితులకు అందరూ సహకరించాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 6, 2025
‘SIR’ను వ్యతిరేకించిన మమతకూ ఫామ్ ఇచ్చిన BLO

SIRకు వ్యతిరేకంగా 2 రోజుల కిందట బెంగాల్ CM మమతా బెనర్జీ <<18197344>>ర్యాలీ<<>> నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాతి రోజే ఓటర్ లిస్ట్ ఎన్యుమరేషన్ ఫామ్‌ను ఆమె అందుకున్నారు. కోల్‌కతాలోని CM నివాసానికి నిన్న బూత్ లెవల్ ఆఫీసర్ వెళ్లారు. ఫామ్‌ను నేరుగా మమతకే ఇస్తానని సెక్యూరిటీ సిబ్బందికి BLO చెప్పినట్లు సమాచారం. దీంతో స్వయంగా మమత వచ్చి తీసుకున్నారని తెలుస్తోంది. దాన్ని నింపిన తర్వాత BLOకు ఇవ్వనున్నారు.
News November 6, 2025
ONGCలో 2,623 అప్రెంటీస్‌లు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)లో 2,623 అప్రెంటీస్ ఖాళీలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ongcindia.com/
News November 6, 2025
అఫ్గాన్‌తో చర్చలు విఫలమైతే యుద్ధమే: పాక్

ఇవాళ ఇస్తాంబుల్‌లో శాంతి చర్చల నేపథ్యంలో అఫ్గాన్ ప్రభుత్వానికి పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరికలు జారీ చేశారు. అఫ్గాన్‌లో తాలిబన్లను ఎదుర్కోవడానికి సైనిక ఘర్షణే ఏకైక పరిష్కారమా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘చర్చలు విఫలమైతే యుద్ధం జరుగుతుంది’ అని ఆసిఫ్ పేర్కొన్నారు. గత నెల ఇరు దేశాల మధ్య కుదిరిన సీజ్‌ఫైర్ ఒప్పందానికి కొనసాగింపుగా ఇవాళ తుర్కియే, ఖతర్ చొరవతో మరోసారి చర్చలు జరగనున్నాయి.


