News September 6, 2024
బాలకృష్ణ వారసుడొచ్చేశాడు.. మూవీ పోస్టర్ రిలీజ్
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘హనుమాన్’ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్న మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో మోక్షజ్ఞ నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆయన బర్త్ డే సందర్భంగా సినిమాలోని లుక్‌ను రివీల్ చేశారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా త్వరలోనే టైటిల్, అప్డేట్స్ వెల్లడిస్తామన్నారు. మోక్షజ్ఞ లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News February 4, 2025
అసెంబ్లీ వాయిదా.. హరీశ్ ఫైర్
TG: అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించిన కాసేపటికే వాయిదా వేయడంపై BRS MLA హరీశ్‌రావు ఫైరయ్యారు. ‘అసెంబ్లీ ప్రారంభమైన 2 నిమిషాలకే వాయిదా వేయటం ఏంటి? క్యాబినెట్ సమావేశం కొనసాగుతుందని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదం. నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, నేడు ప్రభుత్వంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?’ అని ఎద్దేవా చేశారు.
News February 4, 2025
దూరమై ఒక్కటైన వేళ.. ఉద్వేగ క్షణాలు!
మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివెళ్లగా రద్దీ కారణంగా చాలా మంది తప్పిపోతున్నారు. అలాంటి వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఫాఫా మౌ జంక్షన్ రైల్వే స్టేసన్‌లో ఓ మహిళ తప్పిపోగా.. ఆమెను తన భర్తతో కలిపేందుకు రైల్వే పోలీసులు అవిశ్రాంతంగా శ్రమించి, అనౌన్స్‌మెంట్స్ ఇచ్చి ఎట్టకేలకు ఒక్కటి చేశారు. ఆ సమయంలో వారు ఉద్వేగానికి లోనై అందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపిన ఫొటో వైరలవుతోంది.
News February 4, 2025
అమెరికా x చైనా: యుద్ధం మొదలైంది!
రెండు అతిపెద్ద ఎకానమీస్ మధ్య ట్రేడ్ వార్ మళ్లీ మొదలైంది. అమెరికాపై చైనా ప్రతీకార టారిఫ్స్ దాడి ఆరంభించింది. అక్కడి నుంచి దిగుమతి చేసుకొనే బొగ్గు, LNG ఉత్పత్తులపై 15%, క్రూడాయిల్, వ్యవసాయ యంత్రాలు, పెద్ద కార్లు, పికప్ ట్రక్స్‌పై 10% సుంకాలు ప్రకటించింది. Feb 10 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. చైనా ఉత్పత్తులపై ట్రంప్ వేసిన 10% టారిఫ్స్ శనివారం నుంచి అమల్లోకి రావడంతో ప్రతీకారానికి దిగింది.