News September 6, 2024
టెక్నీషియన్లను పిలిపించండి CM
AP: విజయవాడలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులపై సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్ల క్లీనింగ్‌ను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. కరెంట్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్స్, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వివరాలు తెలుసుకున్నారు. వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్లను పిలిపించాలని సూచించారు.
Similar News
News February 4, 2025
కేసీఆర్ కుటుంబానికి ప్రధాని సానుభూతి
TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి సకలమ్మ మరణించడంతో సంతాప సందేశం తెలియజేశారు. అక్క మరణంతో బాధలో ఉన్న గులాబీ బాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News February 4, 2025
ఫారినర్స్‌ను పంపడానికి మంచి ముహూర్తం కావాలా: సుప్రీంకోర్టు ఫైర్
విదేశీయులను పంపించడానికి ఏదైనా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారా అంటూ అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంకెన్నాళ్లు వారిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతారని అడిగింది. 2 వారాల్లోగా 63 మందిని పంపేయాలని జస్టిస్ అభయ్, ఉజ్జల్ బెంచ్ ఆదేశించింది. ‘వాళ్ల అడ్రసులు తెలియవని పంపించరా? ఆ బాధ మీకెందుకు? వాళ్ల దేశానికి పంపేయండి. ఒకరిని విదేశీయుడిగా గుర్తించాక చర్యలు తీసుకోవాల్సిందే’ అని పేర్కొంది.
News February 4, 2025
పార్టీ విప్‌లను నియమించిన KCR
TG: శాసనసభ, మండలిలో బీఆర్ఎస్ పార్టీ విప్‌లను నియమిస్తూ KCR నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో బీఆర్ఎస్ విప్‌గా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, మండలిలో విప్‌గా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌ను నియమించారు. తమ పార్టీ అధినేత KCR నిర్ణయాన్ని స్పీకర్‌కు ఆ పార్టీ నేతలు తెలియజేశారు.