News September 6, 2024

YS జగన్ కీలక నియామకం.. ఎవరీ ఆళ్ల మోహన్ సాయిదత్?

image

AP: ఎన్నికల్లో ఓటమి తర్వాత YCP పునర్నిర్మాణ దిశగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ నిర్మాణంలో సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్‌ను నియమించారు. ఈయన చెన్నై IITలో చదివారు. సాయిదత్ టీమ్ TG లోక్‌సభ ఎన్నికల్లో BJPకి పనిచేసింది. ఢిల్లీలో ఆ పార్టీ నాయకుడికి ఫీడ్‌బ్యాక్ టీమ్‌గానూ సేవలందించింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈయన గతంలో మంగళగిరిలో లోకేశ్ వ్యూహకర్తగా పనిచేసినట్లు సమాచారం.

Similar News

News February 4, 2025

రైతులకు ‘సోలార్’ పంట.. అప్లై చేసుకోండిలా

image

TG: ‘PM కుసుమ్’ స్కీమ్ కింద సాగుకు యోగ్యం కాని భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే రైతులకు ప్రభుత్వం లోన్లు ఇవ్వనుంది. దీనికోసం ఈనెల 22లోగా రెడ్‌కో <>సైట్‌లో<<>> అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఒక్కో చోట 500kW నుంచి 2MW ఉత్పత్తి చేసేలా ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. 1MW ఉత్పత్తికి 3-4 ఎకరాల భూమి అవసరం అవుతుంది. kW పవర్‌కు ₹3.13 చెల్లించి ప్రభుత్వమే విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది.

News February 4, 2025

కేసీఆర్‌ కుటుంబానికి ప్రధాని సానుభూతి

image

TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి సకలమ్మ మరణించడంతో సంతాప సందేశం తెలియజేశారు. అక్క మరణంతో బాధలో ఉన్న గులాబీ బాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News February 4, 2025

ఫారినర్స్‌ను పంపడానికి మంచి ముహూర్తం కావాలా: సుప్రీంకోర్టు ఫైర్

image

విదేశీయులను పంపించడానికి ఏదైనా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారా అంటూ అస్సాం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇంకెన్నాళ్లు వారిని నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతారని అడిగింది. 2 వారాల్లోగా 63 మందిని పంపేయాలని జస్టిస్ అభయ్, ఉజ్జల్ బెంచ్ ఆదేశించింది. ‘వాళ్ల అడ్రసులు తెలియవని పంపించరా? ఆ బాధ మీకెందుకు? వాళ్ల దేశానికి పంపేయండి. ఒకరిని విదేశీయుడిగా గుర్తించాక చర్యలు తీసుకోవాల్సిందే’ అని పేర్కొంది.

error: Content is protected !!