News September 6, 2024

ట్రైనీ డాక్టర్‌ది గ్యాంగ్ రేప్ కాదు: సీబీఐ వర్గాలు

image

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్ రేప్ జరగలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆమెపై సంజయ్ రాయ్ ఒక్కడే దారుణానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నాయి. ఈ కేసులో దర్యాప్తు తుది దశకు చేరుకుందని, త్వరలోనే కోర్టులో అభియోగాలు దాఖలు చేయనున్నట్లు తెలిపాయి. కాగా ఈ కేసును తొలుత పశ్చిమ బెంగాల్ పోలీసులు దర్యాప్తు చేశారు. విచారణపై అనుమానాలు రేకెత్తడంతో హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది.

Similar News

News March 4, 2025

రాత్రిపూట నేలపై పడుకుంటే..

image

వేసవి వచ్చేసింది. ఉక్కబోత అల్లాడించే ఈ కాలంలో పరుపు నుంచి కూడా వేడి వస్తుంటుంది. అసలే రోజంతా పనులతో అలసిపోయిన శరీరం కునుకు తీసేందుకు పరుపుపై వాలగానే ఏదో అసౌకర్యం. అలాంటప్పుడు చక్కగా నేలపై నిద్రపోవడం చాలా మంచిదంటున్నారు జీవనశైలి నిపుణులు. చల్లటి నేలపై మంచి నిద్రే కాక ఒళ్లు నొప్పులకూ ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. నేలపై నిద్రను హాయిగా ఆస్వాదించాలని సూచిస్తున్నారు.

News March 4, 2025

క్రికెట్ అంటే తెలియనివాళ్లు ఇలా మాట్లాడటం విడ్డూరం: భజ్జీ

image

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ బాడీ షేమింగ్ కామెంట్స్ దురదృష్టకరమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. క్రికెట్ తెలియనివారు కూడా ఇలా మాట్లాడటం విడ్డూరమన్నారు. క్రీడాకారులకూ ఎమోషన్స్, సెంటిమెంట్లు ఉంటాయని, ఇలాంటి కామెంట్స్ ఎంత బాధిస్తాయో తెలుసుకోవాలని హితవు పలికారు. రోహిత్ అద్భుతమైన ప్లేయర్‌ అని, గొప్ప నాయకుడని భజ్జీ కొనియాడారు.

News March 4, 2025

ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ మృతి

image

ముంబై లెజెండరీ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్(84) కన్నుమూశారు. వృద్ధాప్యంతో ఆయన తుది శ్వాస విడిచారు. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 589 వికెట్లు పడగొట్టారు. పదకొండు సార్లు 10 వికెట్ల ఘనత సాధించారు. 12 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన పద్మాకర్ 16 వికెట్లు తీశారు. 2017లో సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.

error: Content is protected !!