News September 6, 2024
సులభతర వ్యాపారంలో కేరళ, ఏపీ టాప్.. తెలంగాణ లాస్ట్

రాష్ట్రాల్లో వ్యాపారాలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్(BRAP) ర్యాంకింగ్స్‌లో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రెండో స్థానంలో AP ఉండగా, ఆ తర్వాత గుజరాత్, రాజస్థాన్, త్రిపుర, UP ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, పుదుచ్చేరి అట్టడుగున నిలిచాయి. మొత్తం 30 సంస్కరణల్లో కేరళ తొమ్మిది, ఏపీ 5 సంస్కరణలు అమలు చేశాయి.
Similar News
News July 6, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణకు ట్రాఫిక్ ఆంక్షలు

గిరి ప్రదక్షిణ రూట్లో వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని సూచించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులు వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు నిర్దేశిత ప్రాంతాలను గుర్తించామన్నారు.
News July 6, 2025
4 బంతుల్లో 3 వికెట్లు

మేజర్ లీగ్ క్రికెట్‌లో ఆడమ్ మిల్నే అదరగొట్టారు. సియాటెల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి టెక్సాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. 19వ ఓవర్‌లో తొలి 2 బంతులకు 2 వికెట్లు పడగొట్టిన అతడు 4వ బంతికి మరో వికెట్ తీసి సియాటెల్‌ను ఆలౌట్ చేశారు. దీంతో మొత్తం ఆ ఓవర్‌లో 4 బంతుల్లోనే 3 వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్ 188 రన్స్ చేయగా ఛేజింగ్‌లో సియాటెల్ 137 పరుగులకే కుప్పకూలింది.
News July 6, 2025
‘లక్కీ భాస్కర్’కు సీక్వెల్ ఉంది: డైరెక్టర్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ వెంకీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ధనుష్‌తో తాను తీసిన ‘సార్’ సినిమాకు మాత్రం సీక్వెల్ లేదని తెలిపారు. గత ఏడాది OCTలో విడుదలైన ‘లక్కీ భాస్కర్’ ₹100crకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం వెంకీ తమిళ హీరో సూర్యతో ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు.