News September 6, 2024
నాగార్జున సాగర్ 4 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. 4 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 32 వేల 276 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో: 1,55,845 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో : 72,845 క్యూసెక్కులుంది. పూర్తి స్థాయి నీటి మట్టం: 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం: 589.70 అడుగులుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం: 312 టీఎంసీలుండగా ప్రస్తుత 311.1486 టీఎంసీల నీరుంది.
Similar News
News March 1, 2026
NLG: సెగలు పుట్టిస్తున్న భానుడు

నల్గొండ జిల్లాలో ఈ ఏడాది వేసవి సెగలు ముందే మొదలయ్యాయి. సాధారణంగా మార్చిలో ఉండే ఎండలు ఫిబ్రవరి చివరి వారంలోనే కనిపిస్తుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు పైగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భానుడి ప్రతాపానికి జనం విలవిల్లాడుతున్నారు. ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే, ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
News March 1, 2026
దేవాలయాల పాలకవర్గాలకు నోటిఫికేషన్

దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న NKP, CTL మండలాల్లోని పలు దేవాలయాలకు పాలకవర్గాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించారు. NKP మండలంలో NKP ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి, రామలింగేశ్వరస్వామి, ఎం.ఎడవెల్లిలోని హనుమాన్, షాపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి, మాండ్రలోని శ్రీ ఆంజనేయస్వామి CTL మండలం పేరుపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయ పాలకవర్గాల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది.
News February 28, 2026
NLG: ఇంటర్ పరీక్షలు.. నాలుగో రోజు 281 మంది గైర్హాజరు

జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 281 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డిఐఈఓ దస్రూనాయక్ తెలిపారు. జనరల్ విభాగంలో మొత్తం 11,050, మంది విద్యార్థులకు గాను 10, 839మంది హాజరుకాగా, 211 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,884 మంది విద్యార్థులకు గాను 1,814 మంది హాజరుకాగా, 70 మంది గైర్హాజరయ్యారు.


