News September 6, 2024
గోదావరిలో దూకి కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

గోదావరిలో దూకి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం భద్రాచలంలో జరిగింది. స్థానిక పాత బ్రిడ్జిపై నుంచి పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణ రెడ్డి గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 24, 2026
ఖమ్మం: ‘రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి’

ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రంజాన్ మాసం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో, ముస్లిం ప్రతినిధులతో సమీక్షించారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద ఎక్కడైనా డ్రైనేజీ, అప్రోచ్ రోడ్డు గుంతల మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూచించారు.
News January 24, 2026
గన్ని బ్యాగుల స్టాక్ పటిష్టంగా భద్రపర్చాలి: అ.కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఉన్న గన్ని బ్యాగుల స్టాక్ పటిష్టంగా భద్రపర్చాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో గన్ని సంచుల స్టాక్‌పై గోడౌన్ మేనేజర్‌లతో సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్ నుంచి జూట్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయని, రాబోయే రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు గన్ని బ్యాగుల ఇబ్బందులు రాకుండా రేషన్ షాపులు, గోడౌన్ నుంచి అందుబాటులో ఉన్న స్టాక్ భద్రపర్చుకోవాలని సూచించారు.
News January 24, 2026
గన్నీ బ్యాగుల నిల్వలను పటిష్టంగా భద్రపర్చాలి: అదనపు కలెక్టర్

రబీ సీజన్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గన్నీ బ్యాగుల నిల్వలను పటిష్టంగా భద్రపర్చాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జిల్లాలోని గోడౌన్ మేనేజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్ నుంచి జూట్ సరఫరాలో సాంకేతిక ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


