News September 6, 2024
120 ఏళ్లలో కృష్ణమ్మ వరద ఉద్ధృతి వివరాలు..

ప్రకాశం బ్యారేజీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఇన్ఫ్లో నమోదయిన విషయం తెలిసిందే. అయితే 120 ఏళ్లలో కృష్ణమ్మ వరద ఉద్ధృతి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1903 అక్టోబర్ 7న 10.68లక్షల క్యూసెక్కులు, 1914 ఆగస్టు11న 9.49, 1917 నవంబర్ 2న 9.55, 1949 సెప్టెంబర్ 24న 9.25, 1964 అక్టోబర్ 2న 9.88, 1998 అక్టోబర్ 17న 9.32, 2009 అక్టోబర్ 5, 6న 10.94, 2024 సెప్టెంబరులో 11.38లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరద వచ్చింది.
Similar News
News September 18, 2025
గుంటూరులో అతిసార కేసులపై కలెక్టర్ సమీక్ష

గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్య అధికారులను అప్రమత్తం చేశారు. కేసులపై తక్షణమే నివేదిక సమర్పించాలని, వ్యాధి విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే చేసి, పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.
News September 18, 2025
గుంటూరులో డయేరియా కేసులు

గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కారణంగా కలుషితమైన ఆహారం, నీటి వల్ల వాంతులు, విరోచనాలు పెరిగాయని వైద్యులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల నుంచి 35 మంది అతిసార లక్షణాలతో జీజీహెచ్లో చేరారు. అతిసార రోగులకు ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నామని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ తెలిపారు.
News September 18, 2025
బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. బుధవారం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో బందోబస్తు సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే ప్రముఖులతో మర్యాదగా వ్యవహరిస్తూ, విధి నిర్వహణలో మాత్రం కఠినంగా ఉండాలని సూచించారు. ఏవైనా ఆకస్మిక ఘటనలు జరిగినప్పుడు పక్క సెక్టార్లలోని పోలీసులు సహాయం అందించాలని చెప్పారు.