News September 6, 2024
నితీశ్ కుమార్ మళ్లీ పక్కచూపులు!
బిహార్‌లో CM నితీశ్ కుమార్ మళ్లీ పక్కచూపులు చూస్తున్నారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. విపక్ష RJD నేత తేజస్వీ యాదవ్‌తో నితీశ్ భేటీ వార్తలు ఈ ప్రచారానికి బలంచేకూర్చాయి. ఈ ఊహాగానాల మధ్య BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా 2 రోజులు బిహార్‌లో పర్యటిస్తుండడంతో రాజకీయాలు మరింత వేడెక్కించాయి. అయితే, నితీశ్-తేజస్వీల భేటీ కేవలం సమాచార కమిషనర్ నియామకంపైనే అని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News February 4, 2025
1931 తర్వాత కులగణన ఇదే: సీఎం రేవంత్
TG: బ్రిటిష్ హయాంలో 1931లో కులగణన జరిగింది తప్ప స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. ప్రతి పదేళ్లకు చేపడుతున్న జనాభా లెక్కల్లో ఎస్సీలు, ఎస్టీల లెక్కలను మాత్రమే తీసుకుంటున్నారని, బలహీన వర్గాల (BC) సమాచారం ఉండట్లేదన్నారు. వారికి విద్య, ఉద్యోగాల్లో సముచిత స్థానం ఇవ్వడానికే రాహుల్ గాంధీ సూచనలతో తాము తెలంగాణలో కులగణన చేపట్టామని సీఎం చెప్పారు.
News February 4, 2025
భయమెందుకు.. పోరాడితే గెలుపు నీదే!
క్యాన్సర్ వచ్చిందని కుంగిపోకుండా దానిని జయించేందుకు సిద్ధంగా ఉండాలని వ్యాధి విజేతలంటున్నారు. ‘క్యాన్సర్ వచ్చిందంటే దాన్ని జయించడమే మన ముందున్న ఏకైక అవకాశం’ అని క్రికెటర్ యువరాజ్ చెప్పారు. ‘నాకు బాధితురాలిగా ఉండటం నచ్చదు. భయం, నెగిటివిటీకి నా జీవితంలో చోటులేదు’ అని నటి హంసా నందిని అన్నారు. ‘బలమైన సైనికులకే దేవుడు కష్టమైన యుద్ధాలను ఇస్తాడు’ అని నటుడు సంజయ్ దత్ చెప్పారు. భయాన్ని వీడి పోరాడి గెలవండి.
News February 4, 2025
బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై పోలీసులకు ఫిర్యాదు
హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరోసారి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ బాషాపై ఆమె ఫిర్యాదు చేశారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నం చేశారని ఆధారాలతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు. మస్తాన్‌సాయి, శేఖర్ బాషా కాల్ సంభాషణలను అందజేశారు. పలువురు మహిళల అభ్యంతరకర వీడియోలు కలిగి ఉన్నారని మస్తాన్ సాయిపై నిన్న లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.