News September 6, 2024

పెండ్లిమర్రి ప్రాథమిక కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

పెండ్లిమర్రి మండలంలోని నందిమండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శివశంకర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత నెలరోజులుగా ఒక్క కాన్పు కేసు కూడా నమోదు కాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్టోబర్ మాసంలో ఆరోగ్య కేంద్రంలో కనీసం 10 కాన్పులు నమోదయ్యేలా స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

Similar News

News November 2, 2025

వరల్డ్ కప్.. వికెట్ పడగొట్టిన శ్రీచరణి

image

మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన టీం ఇండియా బౌలర్ శ్రీచరణి వికెట్ పడగొట్టింది. సౌతాఫ్రికా 62 పరుగుల వద్ద ఉండగా ఆమె బ్యాటర్ బాష్(Bosch)ను రెండో వికెట్‌గా పెవిలియన్‌కు పంపింది.

News November 2, 2025

మాజీ ఉప రాష్ట్రపతిని కలిసిన మాజీ సైనికులు

image

కడప R&B గెస్ట్ హౌస్‌లో మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును ఆదివారం జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ మాజీ సైనికులు మర్యాదపూర్వకంగా కలిశారు. అందరూ కలిసి కట్టుగా ఐకమత్యంగా సంతోషంగా ఉండాలని వెంకయ్య చెప్పారన్నారు. తమ పట్ల మాజీ ఉప రాష్ట్రపతి చూపిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపామని వారు అన్నారు.

News November 2, 2025

విద్యుత్ సమస్యలా.. ఈ నంబర్ కు కాల్ చేయండి.!

image

ప్రతి సోమవారం విద్యుత్ సమస్యలపై డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని మొట్టమొదటగా నిర్వహించనున్నట్లు సంస్థ ఛైర్మన్ శివశంకర్ లోతేటి తెలిపారు. ఇందులో భాగంగా రాయలసీమ జిల్లా వాసులు ఉదయం 10-12 గంటల మధ్య 89777 16661 నంబర్‌కు కాల్ చేసి తమ సమస్యలను వివరించవచ్చన్నారు.