News September 6, 2024
తాగుడుకు బానిసైన భర్త.. భార్య తిట్టిందని సూసైడ్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన మెర్ల సత్తయ్య(53) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. SI శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మద్యానికి బానిసైన సత్తయ్య రోజూ తాగి ఇంటికి రావడంతో భార్య మందలించింది. కోపంతో గురువారం పురుగు మందు తాగిన సత్తయ్య.. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్సై తెలుపారు.
Similar News
News January 18, 2026
తూ.గో: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కొవ్వూరు మండలం దేచర్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్ట సత్యనారాయణ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. పంగిడి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సత్యనారాయణతో పాటు ఉన్న కోటి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు క్రషర్ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. సత్యనారాయణకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 18, 2026
తెలుగు జాతి ఖ్యాతి ఎన్టీఆర్: పురందీశ్వరి

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి ఆదివారం ఆయనకు ఘన నివాళులర్పించారు. ఒక ఉత్తమ నాయకుడు జన్మిస్తే ఆ వంశానికే కాక మొత్తం జాతికే గుర్తింపు వస్తుందని కొనియాడారు. ఉన్నత విలువలు కలిగిన ఎన్టీఆర్ వల్ల తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్త ఖ్యాతి లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ తన తండ్రి జ్ఞాపకాలను పురందీశ్వరి స్మరించుకున్నారు.
News January 18, 2026
వేగం కన్నా ప్రాణం మిన్న.. వాహనదారులకు ఎస్పీ హితవు

సంక్రాంతి ముగించుకుని గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు రహదారి నియమాలు పాటించాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ సూచించారు. రోడ్లపై రద్దీ దృష్ట్యా వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, వేగంగా వెళ్లడం కంటే క్షేమంగా చేరడం ముఖ్యమని హితవు పలికారు. వీలైనంత వరకు రాత్రి ప్రయాణాలు మానుకోవాలని కోరారు. అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు నివారించాలని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో కోరారు.


