News September 6, 2024
31 మందితో కాంగ్రెస్ తొలి జాబితా

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. మొత్తం 90 స్థానాల్లో 31 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లతో జాబితా రిలీజ్ చేసింది. ప్రతిపక్ష నేత భూపేందర్ హుడా గర్హి సంప్లా-కిలోయ్ నుంచి, రెజ్లర్ వినేశ్ ఫొగట్ జులానా నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ వీరి అభ్యర్థిత్వాలను ఖరారు చేసినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.
Similar News
News July 5, 2025
కాసేపట్లో వర్షం: వాతావరణ కేంద్రం

TG: రాబోయే 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, భూపాలపల్లి, గద్వాల్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్, మేడ్చల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం పడుతుందని అంచనా వేసింది. గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
News July 5, 2025
ప్రసిద్ధ్ కృష్ణపై ట్రోల్స్

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఘోరంగా విఫలమైన భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణపై SMలో భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. షార్ట్ పిచ్ బంతులు వేసి జేమీ స్మిత్ సెంచరీకి కారణమయ్యాడని పలువురు విమర్శిస్తున్నారు. ‘ప్రసిద్ధ్ భారత్ వెర్షన్ హారిస్ రవూఫ్’ అని ఒకరు, ‘అతడిని వెంటనే ఇండియాకు పంపండి.. అవసరమైతే టికెట్ నేనే స్పాన్సర్ చేస్తా’ అని మరొకరు, ‘ప్రసిద్ధ్ ఇంగ్లండ్ తరఫున రన్ మెషిన్’ అని ఇంకొకరు కామెంట్లు పెడుతున్నారు.
News July 5, 2025
IIIT లిస్ట్.. ఒకే స్కూల్ నుంచి 26 మంది ఎంపిక

TG: నిన్న విడుదలైన బాసర IIIT <<16941421>>జాబితాలో<<>> నిజామాబాద్ జిల్లాలోని డొంకేశ్వర్ ZPHS విద్యార్థులు సత్తాచాటారు. ఏకంగా ఈ స్కూలు నుంచి 26 మంది ఎంపికయ్యారు. వీరిలో 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. ఈ మండలం నుంచి 41 మంది స్టూడెంట్స్ సెలక్ట్ అవ్వడం గమనార్హం. ఎంపికైన విద్యార్థులకు స్కూల్ సిబ్బంది అభినందనలు తెలిపారు. కాగా తొలి విడతలో 1,690 మంది ఎంపికయ్యారు.