News September 7, 2024
హైదరాబాద్ అంతా NIGHT OUT

వినాయక చవితి నేపథ్యంలో HYD, ఉమ్మడి RRలో యువత నైట్ అవుట్ చేసింది. అర్ధరాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు ఏ వీధిలో చూసినా యువకులు మండపాలు వేయడం, డెకరేషన్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇక విగ్రహాలు కొనుగోలు చేసేందుకు నాగోల్, ధూల్‌పేట్‌కు పోటెత్తారు. మరోవైపు పలు చోట్ల పండుగ సామగ్రి విక్రయ షాపులు అర్ధరాత్రి వరకు తెరిచే ఉండడంతో సందడి నెలకొంది. వినాయక చవితి తమకు స్పెషల్ ఫెస్టివల్ అని యువకులు తెలిపారు.
Similar News
News September 14, 2025
HYD: 1000 టన్నుల నిమజ్జన వ్యర్ధాలు తొలగింపు

వినాయక విగ్రహాల నిమజ్జనం తర్వాత హుస్సేన్‌సాగర్‌తో పాటు చుట్టూ ఉన్న రోడ్లు, ఫుట్‌పాత్‌ల నుంచి GHMC, HMDA సిబ్బంది 1000 టన్నుల నిమజ్జన వ్యర్థాలు, చెత్తాచెదారం తొలగించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 500 మంది పారిశుద్ధ్య కార్మికులు చెత్త తొలగింపులో నిమగ్నం అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది నిమజ్జన వ్యర్థాలు 150 టన్నుల మేర అదనంగా తొలగించినట్లు అధికారులు తెలిపారు.
News September 14, 2025
HYD: నేడు గాంధీ మెడికల్ కాలేజీ వ్యవస్థాపక దినోత్సవం

సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాల నేటికి 71 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా గాంధీ కళాశాల ప్రాంగణంలోని అలుమ్ని భవనంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు డా.జీఆర్ లింగమూర్తి, వెంకటరత్నంలు తెలిపారు. కాగా.. గాంధీ మెడికల్ కళాశాల దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక ఆస్పత్రిగా నిలిచింది.
News September 14, 2025
HYD: కృష్ణా జలాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 23 నుంచి ఢిల్లీలో జరిగే కృష్ణా జలాల ట్రిబ్యునల్ విచారణలో రాష్ట్రం తరఫున బలమైన వాదనలు వినిపించే వ్యూహంపై చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్. వైద్యనాథన్, సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్ వోహ్రా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.