News September 7, 2024

147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డు

image

క్రికెట్ చరిత్రలో తొలి 7 టెస్ట్ సెంచరీలను 7 వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్‌గా ఇంగ్లండ్ ప్లేయర్ ఒలి పోప్ నిలిచారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో ఈ ఫీట్‌ను సాధించారు. పోప్ కు ఇది 49వ టెస్ట్ కాగా, ఇప్పటివరకు 7 సెంచరీలు బాదారు. వీటిని ఆరు వేర్వేరు మైదానాల్లో చేయడం విశేషం. SA, NZ, IND, SL, WI, IRE, PAK జట్లపై ఆయన శతకాలు నమోదు చేశారు.

Similar News

News November 4, 2025

కార్తీక పౌర్ణమి: ఉపవాసం ఎలా ఉండాలి?

image

‘కార్తీక పౌర్ణమి రోజున రోజంతా ఉపవాసం ఉండడం మంచిది. అది వీలుకాకపోతే దేవుడిపై మనసు లగ్నం చేస్తూ మితంగా ఆహారం తీసుకోవచ్చు. వాయుపురాణం ప్రకారం.. పెసరపప్పు-బియ్యం కలిపి వండిన పదార్థాన్ని ఒకసారి మాత్రమే తీసుకోవచ్చు. సహజ ఫలాలు, నువ్వులు-బెల్లం ఉండలు, పంచామృతం, తులసినీరు వంటివి కూడా స్వీకరించవచ్చు. అయితే, ఏ ఆహారాన్నైనా ఒకసారి మాత్రమే తీసుకోవడం ఉత్తమం. మాటిమాటికి వద్దు’ అని పండితులు సూచిస్తున్నారు.

News November 4, 2025

మాగాణి భూముల్లో వరికి ప్రత్యామ్నాయ పంటలు

image

వరి మాగాణి భూముల్లో ఆరుతడి పంటల సాగుతో అధిక లాభం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ, ఆవాలు, నువ్వులు, శనగ, పెసలు, మినుము, జొన్న, సజ్జ, రాగులు, కొర్రలు, కూరగాయలు, పొద్దుతిరుగుడు, ఆముదం, పత్తి వంటి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటి సాగు వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు రైతులకు విభిన్న పంటలతో ఆదాయం పెరుగుతుంది. వరి పంటపై ఆధారపడటం తగ్గుతుంది.

News November 4, 2025

మహిళల్లో ఫైనాన్షియల్‌ లిటరసీ పెంచాలని..

image

మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిస్తే అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని ఇన్నర్‌ గాడెస్‌ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది అనన్య పరేఖ్. చెన్నైకు చెందిన అనన్య ఇంజనీరింగ్‌ తర్వాత మహిళల హక్కులు, సాధికారతపై దృష్టి పెట్టింది. వ్యవహార దక్షత నుంచి వ్యాపార నిర్వహణ వరకు వర్క్‌షాపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తూ ఎందరికో దారి చూపుతున్నారు.