News September 7, 2024

సత్యవేడు MLAపై అత్యాచార కేసు..UPDATE

image

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధిత మహిళను పోలీసులు శుక్రవారం ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ చేయడానికి చికిత్సలు చేయించుకోమన్నారు. అయితే ఆమె పరీక్షలకు నిరాకరించినట్లు సమాచారం. సాక్ష్యాలు తారుమారు అవుతాయని వైద్యులు, పోలీసులు చెప్పినా వినకుండా వెళ్లిపోయిందన్నారు. మరో రెండురోజుల్లో పరీక్షలకు వస్తానని చెప్పారన్నారు.

Similar News

News November 3, 2025

అడవి పందుల కోసం వేట.. ఇద్దరి మృతి

image

బంగారుపాలెం మండలంలో విషాదం చోటు చేసుకుంది. బండ్లదొడ్డి గ్రామపంచాయతీలో వన్య ప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో ఒక అడవి పంది కూడా చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News November 3, 2025

చిత్తూరు: వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఆర్‌ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, ఆర్డీవో శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి పాల్గొన్నారు.

News November 3, 2025

మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్య ప్రవర్తన

image

ఓ మహిళతో రాపిడో బైక్ రైడర్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. అలిపిరి PS పరిధిలో ఓ మహిళ బ్యూటీ పార్లర్ నుంచి ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకుంది. ఆమెను ఇంటి వద్దకు చేర్చిన రైడర్ పెద్దయ్య అనంతరం ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఆమె భర్త నిందితుడిని పట్టుకుని నైట్ బీట్లో ఉన్న అలిపిరి CI రామకిశోర్‌కు అప్పగించారు.