News September 7, 2024

నర్సాపూర్: చెరువులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన అశోక్ మృతదేహం బయటపడింది. శుక్రవారం చేపల వేటకు వెళ్లిన అశోక్ చెరువులో గల్లంతయ్యారు. నర్సాపూర్ ఫైర్ సిబ్బంది కే ప్రశాంత్, నాగరాజు, మధు, రమేశ్, వెంకటేశ్‌లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం తరలించారు.

Similar News

News January 20, 2026

తూప్రాన్: యువతి ఆత్మహత్య

image

తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన గిరిజన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నర్సంపల్లి గ్రామానికి చెందిన ధరావత్ మమత(18) ఈనెల 16న విష పదార్థం తిని ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా లక్ష్మక్కపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు చెప్పారు. మమతకు ఇటీవల వివాహం కూడా నిశ్చయమైనట్లు సమాచారం.

News January 20, 2026

కౌడిపల్లి: బాత్రూంలో పడి యువకుడి మృతి

image

కౌడిపల్లి మండలం వెల్మకన్నకు చెందిన యువకుడు బాత్రూంలో పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు… దేశాయిపేట గణేశ్ శర్మ(28) హైదరాబాద్‌లో ఫిజియోథెరపిస్ట్‌గా పని చేస్తున్నాడు. సోమవారం బాత్రూంలో పడిపోయి ఉండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. ఏడాది క్రితమే గణేశ్ శర్మ వివాహం జరిగింది.

News January 19, 2026

మెదక్: ‘బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే’

image

రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీఐఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ డా. అవ్వారు వేణు కుమార్ డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల వాటా, ఆత్మగౌరవం కోసం పోరాడుతామన్నారు. త్వరలోనే మెదక్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి ‘సామాజిక న్యాయ సభ’ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.