News September 7, 2024
మాజీ సీఎంపై గ్యాంగ్‌స్టర్ భార్య పోటీ

హరియాణాలో కాంగ్రెస్ కీలక నేతను ఎదుర్కొనేందుకు BJP వ్యూహాలు రచిస్తోంది. గార్హీ నుంచి పోటీలో ఉన్న మాజీ CM భూపిందర్ సింగ్ హుడాపై గ్యాంగ్‌స్టర్ రాజేశ్ సర్కార్ భార్య మంజు హుడాను బరిలో నిలిపింది. మాజీ DSP ప్రదీప్ కూతురైన ఆమె ప్రస్తుతం రోహ్‌తక్ జిల్లా ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. భర్త గ్యాంగ్‌స్టర్, తండ్రి సీనియర్ పోలీస్ కావడంతో స్థానికంగా మంజూకు కలిసొస్తుందని BJP భావిస్తోంది. OCT 5న ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News January 24, 2026
RCB బ్యాటింగ్.. జైత్రయాత్ర కొనసాగేనా?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL)లో భాగంగా కాసేపట్లో ఆర్సీబీ, ఢిల్లీ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన ఢిల్లీ.. ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్పటివరకు 5 మ్యాచులాడి అన్నింట్లో గెలిచిన బెంగళూరు ఇందులోనూ విజయం సాధించి జైత్రయాత్ర కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. అటు 5 మ్యాచుల్లో 2 నెగ్గిన DC.. RCBకి తొలి ఓటమి రుచి చూపించాలని పట్టుదలతో ఉంది. మరి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News January 24, 2026
నచ్చని తీర్పిస్తే జడ్జీని బదిలీ చేస్తారా: జస్టిస్ భూయాన్

GOVTకి నచ్చని తీర్పిచ్చారని జడ్జీనెందుకు బదిలీ చేయాలని జస్టిస్ భూయాన్(SC) ఓ వేదికపై ప్రశ్నించారు. అది జుడీషియరీపై ప్రభావం చూపదా అన్నారు. ఇది కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడమేనని స్పష్టం చేశారు. గత ఏడాది కల్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన MP మంత్రికి HC జడ్జీ శ్రీధరన్ నోటీసులిచ్చారు. ఆ తర్వాత అలహాబాద్ బదులు ఆయన్ను ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేశారు. దీనినే భూయాన్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
News January 24, 2026
Photo Gallery: విద్యార్థులతో సీఎం చంద్రబాబు

AP: ఇవాళ నగరి పర్యటనలో CM CBN కాసేపు విద్యార్థులతో గడిపారు. బాలురు, బాలికల పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లను సందర్శించారు. నెట్ జీరో కాన్సెప్ట్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలు, నెట్ జీరో ఎలక్ట్రిసిటీలో భాగంగా స్కూలుపై ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్, కంపోస్ట్ పిట్‌ను పరిశీలించి మాట్లాడారు. హాస్టల్ రూమ్స్, కిచెన్ రూమ్స్ తనిఖీ చేశారు.


