News September 7, 2024
ప.గో.: వరదలపై సీఎం చంద్రబాబు ఆరా

కొల్లేరులో వరద ఉద్ధృతి, ఉప్పుటేరు ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ముఖ్యమంత్రి కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసే అవకాశం ఉందని సమాచారం అందడంతో పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. ఉప్పుటేరులో ప్రవాహానికి అడ్డంకులను తొలగించే పనులు ముమ్మరం చేయించారు.
Similar News
News December 25, 2025
ఆడుకోమని వదిలిన తండ్రి, కొద్దిసేపటికే విగత జీవిగా కొడుకు

పార్కులో తన కొడుకుని ఆడుకోమని వదిలి వెళ్లిన కొద్దిసేపటికి చెరువులో పడి విగత జీవిగా మారిన ఘటన గురువారం పెనుగొండలో చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఆర్.కండ్రిక గ్రామానికి చెందిన జొన్నల ధనరాజు పెనుగొండలో బేకరీ నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం కుమారుడు ఈశ్వర్(5) తీసుకొని బేకరీకి వచ్చిన ధనరాజు కొద్దిసేపు పార్కులో ఆడుకోమని వదిలిపెట్టి వెళ్లాడు. బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు.
News December 25, 2025
ప.గో: ఆటవిడుపు విషాదాంతం.. నీటిలో విగతజీవిగా బాలుడు

పెనుగొండలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని పార్కులో గురువారం మధ్యాహ్నం ఆడుకుంటూ అదృశ్యమైన పదేళ్ల బాలుడు.. రాత్రికి సమీపంలోని చెరువులో విగతజీవిగా లభ్యమయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం గాలించిన స్థానికులు, చెరువులో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
News December 25, 2025
గుండెపోటుతో మొగల్తూరు డిప్యూటీ ఎంపీడీఓ మృతి

మొగల్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల డిప్యూటీ ఎంపీడీఓ ముచ్చర్ల నాగేశ్వరరావు (చిన్నా) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. నరసాపురంలో ఓ మెడికల్ షాపు వద్ద ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతితో మొగల్తూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.


