News September 7, 2024
మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి: CM

AP: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో CM చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నామన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రేపు సాయంత్రానికి వరద నీరు తగ్గిపోతుందని తెలిపారు. TGలో పడే వర్షాల వల్ల APకి కొంత వరద వచ్చే అవకాశం ఉందని, దీనికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు.
Similar News
News November 10, 2025
ప్రభుత్వ లాంఛనాలతో అందెశ్రీ అంత్యక్రియలు

TG: కవి అందెశ్రీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. అందెశ్రీ అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరిగే అవకాశం ఉంది. ఆయన రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రేవంత్ సర్కార్ రాష్ట్ర గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
News November 10, 2025
ప్రస్థానత్రయం అంటే ఏమిటి?

హిందూ తత్వశాస్త్రంలో అత్యంత ప్రామాణిక గ్రంథాలైన ఉపనిషత్తులు(శ్రుతి ప్రస్థానం), బ్రహ్మ సూత్రాలు(న్యాయ ప్రస్థానం), భగవద్గీత (స్మృతి ప్రస్థానం).. ఈ మూడింటిని కలిపి ‘ప్రస్థానత్రయం’ అంటారు. ఇవి జ్ఞాన మార్గానికి దారులుగా పరిగణిస్తారు. ముఖ్య సిద్ధాంతాలకు ఇదే ఆధారం. ప్రతి ఆచార్యుడు తమ సిద్ధాంతాలను స్థాపించడానికి వీటిపై భాష్యం రాయడం తప్పనిసరి. ఇవి బ్రహ్మ జ్ఞానాన్ని బోధించే అత్యున్నత గ్రంథాలు. <<-se>>#VedikVibes<<>>
News November 10, 2025
ఎయిమ్స్ భువనేశ్వర్‌లో 132 పోస్టులు

ఎయిమ్స్ భువనేశ్వర్ 132 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 13 నుంచి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎండీ/ డీఎన్‌బీ/ఎంఎస్/ డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aiimsbhubaneswar.nic.in


