News September 7, 2024
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ వచ్చేసింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. రెండో పాట రిలీజ్ డేట్ ఈ Septలో అనౌన్స్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో వినాయక చవితి కానుకగా అప్డేట్ కోసం ఎంతో ఎదురు చూసిన ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కాగా ఈ మూవీలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సందడి చేయనున్నారు.
Similar News
News November 11, 2025
మౌలానా అజాద్ NITలో ఉద్యోగాలు

మౌలానా అజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (<
News November 11, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 1

1. సూర్యుణ్ణి ఉదయింపజేయువారు ఎవరు? (జ.బ్రహ్మం)
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (జ.దేవతలు)
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (జ.ధర్మం)
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (జ.సత్యం)
5. మానవుడు వేటి వలన శ్రోత్రియుడగును? (జ.వేదాలు)
6. దేనివలన మహత్తును పొందును? (జ.తపస్సు)
7. మానవునికి సహయపడుతుంది ఏది? (జ.ధైర్యం)
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (జ.పెద్దలను సేవించుట వలన) <<-se>>#YakshaPrashnalu<<>>
News November 11, 2025
ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదు.. సమయస్ఫూర్తి!

ఢిల్లీలో పేలుడును ఇంటెలిజెన్స్ ముందే పసిగట్టలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ దేశంలో 2వారాలుగా ఉగ్ర అనుమానితుల అరెస్టులు చూస్తే ఓ రకంగా అప్రమత్తమైన నిఘాతోనే దుర్ఘటన తీవ్రత తగ్గిందని చెప్పొచ్చు. ఫరీదాబాద్‌లో JK పోలీసులు నిన్న భారీ పేలుడు పదార్థాలతో ముగ్గురిని పట్టుకున్నారు. దీంతో ఆ టీమ్‌కు చెందిన డా.ఉమర్ తన వద్ద గల మెటీరియల్‌తో బ్లాస్ట్ చేశాడు. నిఘా నిద్రపోతే అంతా కలిసి భారీ నరమేథం సృష్టించేవారేమో!


