News September 7, 2024
దేశంలోనే సెకండ్ ప్లేస్.. నల్గొండకు రూ.25లక్షలు
నల్గొండ మున్సిపాలిటీ స్వచ్ఛ, వాయు సర్వేక్షన్‌లో 2024లో రెండో స్థానం సాధించడంతో రూ.25 లక్షల ప్రోత్సాహకం లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, రాజస్థాన్ సీఎం బజానా చేతుల మీదుగా ఈరోజు నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అందుకున్నారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ… నల్గొండ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు.
Similar News
News November 17, 2024
నల్గొండ: గ్రూప్-3 పరీక్షలు.. ఇవి గుర్తుపెట్టుకోండి!
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రూప్-3 పరీక్షలకు సంబంధిత అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఒరిజినల్ ఐడీతో పరీక్షకు హాజరుకావాలని, ఉదయం 10 గం. ప్రారంభమయ్యే పేపర్-1 పరీక్షకు 8:30 గంటలలోపు, పేపర్-2కి 1:30- 2:30 వరకు పరీక్షా కేంద్రాల్లో హాజరు కావాలన్నారు. మొదటి రోజు పేపర్-1 పరీక్షకు తీసుకొచ్చిన హాల్‌టికెట్‌ను మిగతా పరీక్షలకు తీసుకొని రావాలని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
#SHARE IT
News November 17, 2024
నాలుగు ఉద్యోగాలు సాధించిన కేశరాజుపల్లి వాసి
నల్గొండ పట్టణ పరిధి కేశరాజుపల్లికి చెందిన ప్రేమ్ – సునీతల కుమారుడు ప్రణబ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2020లో ఫైర్‌మెన్, 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్న ప్రణబ్ రెవెన్యూ శాఖలో చేరనున్నట్లు తెలిపారు.
News November 17, 2024
నాలుగు ఉద్యోగాలు సాధించిన కేశరాజుపల్లి వాసి
నల్లగొండ పట్టణ పరిధి కేశరాజుపల్లికి చెందిన మెండే ప్రేమ్ – సునీతల కుమారుడు మెండే ప్రణబ్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2019లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 2020లో ఫైర్‌మెన్, 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-4లో రెవెన్యూ శాఖలో ఉద్యోగం సాధించాడు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా కొనసాగుతున్న ప్రణబ్ రెవెన్యూ శాఖలో చేరనున్నట్లు తెలిపారు.