News September 7, 2024

‘జైలర్’ విలన్ అరెస్ట్?

image

రజినీకాంత్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’ విలన్ వినాయకన్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో భద్రతా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో అతడిపై RGI పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ నటుడిని అరెస్ట్ చేశారని వార్తలొస్తున్నాయి. గతంలో మహిళలను వేధించిన కేసులో వినాయకన్ అరెస్టైన సంగతి తెలిసిందే.

Similar News

News February 5, 2025

భవన నిర్మాణ అనుమతులపై ప్రభుత్వం మార్గదర్శకాలు

image

AP: భవన నిర్మాణ అనుమతులపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. పట్టణ ప్రాంత స్థానిక సంస్థలే ఇక నుంచి అనుమతులు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. అనుమతుల జారీని అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధి నుంచి పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకు బదిలీ చేసింది. 300చ.మీ. మించని నిర్మాణాలకు యజమానులే ప్లాన్ ధ్రువీకరించి దరఖాస్తు చేసుకోవచ్చు. బహుళ అంతస్తులు కాని నివాస భవనాలకే ఈ వెసులుబాటు కల్పించింది.

News February 5, 2025

వాళ్లందరికీ జీరో కరెంట్ బిల్: కేంద్రం

image

‘ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన’ ద్వారా 45% మందికి జీరో కరెంట్ బిల్ వచ్చినట్లు కేంద్రం తెలిపింది. దీని ద్వారా ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని 8.64లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని కేంద్ర మంత్రి శ్రీపాద యశోనాయక్ చెప్పారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి దాదాపు రూ.77,800 కేంద్రం అందిస్తోందన్నారు. జీరో బిల్లు అనేది సోలార్ కెపాసిటీ, విద్యుత్ ఉత్పత్తి, వినియోగంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

News February 5, 2025

తండేల్ మూవీకి చైతూ రెమ్యునరేషన్ తెలుసా?

image

ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్నతండేల్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో చైతూ పెద్ద మెుత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు పుకారు లేవగా అది తప్పని తెలుస్తోంది. ప్రతి సినిమాకు తీసుకునే 10కోట్ల పారితోషికమే దీనికి ఛార్జ్ చేసినట్లు సమాచారం. నిర్మాతలు తన మార్కెట్ కంటే ఎక్కువ బడ్జెట్ ఈ సినిమాకు ఖర్చు చేయడంతో చైతూ ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!