News September 7, 2024

అసలు ప్రభుత్వం ఉందా? లేదా?: జగన్

image

AP: విజయవాడలో వరద వచ్చి 8 రోజులు గడుస్తున్నా ఇంకా ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయని మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ‘అసలు ప్రభుత్వం అనేది ఉందా? లేదా? అని అనిపిస్తోంది. ఐదారు లక్షల మందిని ఉదారంగా ఆదుకోలేని దీనస్థితిలో ప్రభుత్వం ఉందా? గతంలో చాలా సార్లు 30 సెం.మీ పైగా వర్షం పడినా ఈ మాదిరిగా 50 మందికి పైగా ప్రజలు చనిపోలేదు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరోజులోనే రేషన్ సరుకులు పంపిణీ చేశాం’ అని తెలిపారు.

Similar News

News August 31, 2025

మా కుటుంబం ఎప్పుడూ బీఫ్ తినలేదు: సల్మాన్ ఖాన్ తండ్రి

image

తమ కుటుంబం ఇప్పటివరకు బీఫ్ తినలేదని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తెలిపారు. తాము ముస్లింలైనప్పటికీ తమ ఇంట్లో దానిని నిషేధించామని చెప్పారు. ‘ఆవు పాలు తల్లి పాలతో సమానం. అందుకే మేం బీఫ్‌కు దూరం. ఫుడ్ విషయంలో ఎవరేం తిన్నా అది వారిష్టం. మా ఫ్యామిలీ అన్ని మతాలను గౌరవిస్తుంది. ఇంట్లో అన్ని పండుగలు జరుపుకుంటాం. ఈ ఏడాది కూడా గణపతిని ప్రతిష్ఠించి పూజలు చేశాం’ అని ఆయన పేర్కొన్నారు.

News August 31, 2025

పోలవరం కొట్టుకుపోయినా NDSA ఎందుకు పట్టించుకోవట్లేదు: హరీశ్

image

TG: పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కొట్టుకుపోయినా NDSA ఎందుకు విచారణ జరపడం లేదని హరీశ్ రావు అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘2019-25 వరకు పోలవరం డయాఫ్రమ్ వాల్, గైడ్‌బండ్, కాఫర్ డ్యామ్.. కొట్టుకుపోయాయి. రిపేర్‌కు రూ.7 వేల కోట్లు అవుతుంది. ఆ సమయంలో పోలవరం చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ మేడిగడ్డపై రిపోర్ట్ ఇస్తారా. NDSAకు నచ్చితే ఒక నీతి.. నచ్చకుంటే ఒక నీతి ఉంటుందా’ అని నిలదీశారు.

News August 31, 2025

చికెన్ తిని అలాగే పడుకుంటున్నారా?

image

రాత్రి పూట చికెన్ తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘పడుకునే ముందు చికెన్ తింటే సరిగ్గా జీర్ణం కాదు. గుండెలో మంట, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. నిద్రకు అంతరాయం కలుగుతుంది. కొవ్వు పేరుకుపోయి బరువు పెరగడానికి దారి తీస్తుంది. రక్తపోటు, డయాబెటిస్‌కు కూడా దారి తీసే ఛాన్స్ ఉంది. తిన్న 2-3 గంటల తర్వాత నిద్ర పోవడం ఉత్తమం’ అని నిపుణులు అంటున్నారు.