News September 7, 2024
డిగ్రీ చదివిన వారికి నెలకు రూ.5 వేలు.. బ్యాంకుల ఆఫర్!

డిగ్రీ పూర్తి చేసిన 25 ఏళ్లలోపు వయసు గలవారిని బ్యాంకులు త్వరలో అప్రెంటీస్‌లుగా నియమించుకొని నెలకు రూ.5 వేలు స్టైఫండ్ ఇవ్వనున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రకటన మేరకు గ్రాడ్యుయేట్స్‌కు ఇంటర్న్‌షిప్‌పై కార్పొరేట్ వ్యవహారాల శాఖ బ్యాంకులతో సమావేశమైంది. మరో నెల రోజుల్లో బ్యాంకులు ఈ నియామకాలు ప్రారంభించవచ్చని ఓ అధికారి తెలిపారు. ఏ బ్యాంకు ఎంత మందికి అవకాశం కల్పిస్తుందో తేలాల్సి ఉంది.
Similar News
News March 8, 2025
బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్.. ముగ్గురు అరెస్ట్

AP: గుంటూరు ANUలో బీఎడ్ ప్రశ్నాపత్రం <<15680685>>లీకేజీ<<>> ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లు ఒడిశాకు చెందిన ఏజెంట్లని, ఆ రాష్ట్ర విద్యార్థులకు ఏపీలోని కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తుంటారని తెలిపారు. అలాగే పాస్ చేయించేందుకు క్వశ్చన్ పేపర్లను లీక్ చేస్తుంటారని గుర్తించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.
News March 8, 2025
‘ఛావా’కు తొలి రోజు రూ.3 కోట్లు!

బాలీవుడ్‌లో దాదాపు రూ.480 కోట్లు కలెక్ట్ చేసిన ‘ఛావా’ మూవీ నిన్న తెలుగులో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ వస్తోంది. డబ్బింగ్ ఏమాత్రం బాగాలేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు డైలాగులపై ఫోకస్ చేయాల్సిందంటున్నారు. గీతా ఆర్ట్స్ పెద్ద ఎత్తున విడుదల చేసినా తొలి రోజు కేవలం రూ.3కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
News March 8, 2025
దారుణం: మహిళా టీచర్ల ఫొటోలను తీసి..

TG: విద్యాబుద్ధులు నేర్పే మహిళా టీచర్ల పట్ల కొందరు విద్యార్థులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మహబూబాబాద్(D) తొర్రూరులోని ZP హైస్కూల్‌లో పాఠాలు చెబుతున్న సమయంలో వెనుక నుంచి ఫొటోలు తీశారు. బెంచ్‌లో కూర్చుని ప్రశ్నలకు సమాధానాలిస్తుండగా అసభ్యకరంగా ఫొటోలు తీసి ఇన్‌స్టాలో పోస్టు చేసినట్లు సమాచారం. ఓ విద్యార్థిని గమనించి HMకు ఫిర్యాదు చేయగా, విషయం బయటికి రాకుండా చూసినట్లు తెలుస్తోంది.