News September 7, 2024
అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీసాల సుబ్బన్న

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీసీసీ నూతన కమిటీలకు పిలుపునిచ్చింది. ఆంధ్ర కాంగ్రెస్ సిఫార్సు చేసిన కమిటీలకు ఏఐసీసీ ఆమోదం కూడా తెలిపింది. ఈ క్రమంలోనే 25 జిల్లాల డీసీసీలు, 13మంది వైస్ ప్రెసిడెంట్లు, 37 మంది జనరల్ సెక్రటరీలు, 10 మంది సిటీ ప్రెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించింది. దీనిలో AKP జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మీసాల సుబ్బన్న నియమితులయ్యారు.
Similar News
News January 25, 2026
విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం PGRS రద్దు

విశాఖ సీపీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS జనవరి 26న సోమవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా రద్దు చేసినట్టు సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం తెలిపారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ప్రజలు సమస్యలు ఉంటే 112కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. వచ్చే సోమవారం అనగా ఫిబ్రవరి 2వ తేదీ PGRS యధావిధిగా నిర్వహించనున్నారు.
News January 24, 2026
విశాఖ: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్

విశాఖ-టాటానగర్-విశాఖ (20816/15) వీక్లీ ఎక్స్‌ప్రెస్ టెర్మినల్ స్టేషన్‌ను టాటానగర్ నుంచి ఆదిత్యపూర్‌కు మారుస్తూ వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ మార్పు మార్చి 29 నుంచి అమలులోకి వస్తుంది. రైలు సమయాల్లో కూడా స్వల్ప మార్పులు జరిగాయి. ఆదిత్యపూర్ నుంచి ఉదయం 7.30 గంటలకు రైలు బయలుదేరుతుంది. ప్రయాణికులు పూర్తి వివరాల కోసం 139 నంబర్‌ను సంప్రదించవచ్చు.
News January 24, 2026
విశాఖలో 392 మందికి నియామక పత్రాల అందజేత

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజ్‌గార్ మేళా ప్రవేశపెట్టిందని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఈ మేళా దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించిందన్నారు. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం జరిగిన రోజ్‌గార్ మేళాలో మంత్రి పాల్గొని 392 మందికి నియామక పత్రాలు అందజేశారు.


