News September 8, 2024
అత్యంత భారీ వర్షాలు.. ఈ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్

AP: వాయుగుండం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. అల్లూరి, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
Similar News
News November 3, 2025
క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ పెంచిన ICC ఉమెన్ వరల్డ్ కప్

ICC ఉమెన్స్ WC విజయంతో INDIA TEAMలోని క్రీడాకారిణుల బ్రాండ్ వాల్యూ 35% పెరిగింది. దీంతో పర్సనల్ కేర్, బ్యూటీ, ఫ్యాషన్ విభాగాలే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ రంగాలూ వారి కోసం వెతుకుతున్నాయని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. అయితే బ్రాండ్ ముద్రపడాలంటే వారు కనీస పరిమితి దాటాలని రెడిఫ్యూజన్ ఛైర్మన్ సందీప్ తెలిపారు. PV సింధును 90% గుర్తించడం లేదని, గిల్ ఫొటోతోపాటు పేరూ పెట్టాల్సి వస్తోందన్నారు.
News November 3, 2025
చేవెళ్ల ప్రమాదం.. డ్రైవర్‌కు యాక్సిడెంట్ రికార్డు లేదు: TGSRTC

TG: చేవెళ్ల సమీపంలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు గతంలో ఎలాంటి యాక్సిడెంట్ రికార్డు లేనట్టు తేలిందని TGSRTC వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమిక విచారణ అనంతరం ప్రమాదానికి ఆర్టీసీ బస్సు, డ్రైవర్ కారణం కాదని తెలుస్తోందని ఓ ప్రకటనలో తెలిపింది. రోడ్డు మలుపు వద్ద అతి వేగంతో ఉన్న టిప్పర్ డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పేర్కొంది.
News November 3, 2025
చెత్తవేసే వారి ఫొటోలు పంపిస్తే ₹250 నజరానా

నగర పరిశుభ్రతలో పౌరుల భాగస్వామ్యం కోసం గ్రేటర్ బెంగళూరు అథారిటీ, BSWML కొత్త స్కీమ్ చేపట్టాయి. రోడ్లపై చెత్తవేసే వారి ఫొటో, వీడియో తీసి పంపిస్తే ₹250 చెల్లిస్తామని ప్రకటించాయి. త్వరలోనే దీనికోసం డెడికేటెడ్ నంబర్, SM హ్యాండిల్స్, ప్రత్యేక యాప్ ఏర్పాటు చేయనున్నాయి. కాగా 5వేల ఆటోలతో ఇంటివద్దే చెత్త సేకరిస్తున్నా కొందరు ఇంకా రోడ్లపై వేస్తున్నారని, వారికి ₹2వేల ఫైన్ విధిస్తామని BSWML CEO తెలిపారు.


