News September 8, 2024
దాతలకు కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్

వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వస్తోంది. ఏపీ దుస్థితికి చలించి పోయిన వారంతా విరాళాలు ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, NRIలు పలువురు, ఏపీ ఉద్యోగుల సంఘం తమ విరాళాలను ప్రకటించింది. ఇంకా పలువురు ప్రముఖులు విరాళాలను ప్రకటిస్తూనే ఉన్నారు. విరాళాలు అందజేసిన దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 2, 2026
కృష్ణా: సుంకం ఇవ్వు .. చెరువు తవ్వు..!

కృష్ణా జిల్లాలో వరి పొలాలు అక్రమంగా చేపలు, రొయ్యల చెరువులుగా మారుతున్నాయనే ఆరోపణలొస్తున్నాయి. కృత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం, అవనిగడ్డ పరిధిలో వందల ఎకరాల సాగు భూములతో పాటు మడ అడవులను సైతం ఆక్రమించి తవ్వకాలు జరుపుతున్నారు. చెరువుల వ్యర్థ నీరు కాలువల్లోకి వదులుతుండటంతో పక్కనే ఉన్న పంట పొలాలు నిస్సారమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండతోనే ఇవి జరుగుతున్నాయని టాక్.
News March 2, 2026
మచిలీపట్నంలో మరో ఫోన్ నంబర్

మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్‌లోని సమాచార కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ తోపాటు కొత్తగా సెల్ ఫోన్ నంబర్ 94947 75462ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. ప్రయాణికులు విచారణ నిమిత్తం గతంలో ఉన్న ల్యాండ్ లైన్ నంబర్ 08672-227000తోపాటు నూతన సెల్ నెంబర్ 94947 75462ను సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.
News March 2, 2026
కృష్ణా: గణితం పరీక్షకు 255 మంది గైర్హాజరు

ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా సోమవారం ప్రథమ సంవత్సరం గణితం పరీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లాలో మొత్తం 63 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 15,100 మంది విద్యార్థులకు గాను 14,845 మంది హాజరయ్యారని, 255 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి సరళాదేవి తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదన్నారు.


