News September 8, 2024

ఉమ్మడి జిల్లాలో 2 వేలు ఉపాధ్యాయ ఖాళీలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 3,227 ప్రభుత్వ పాఠశాలల్లో 12,708 మందికి ప్రస్తుతం 10,225 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. 508 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి పరీక్ష నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలల్లో పని చేస్తున్న 1,975 మంది SGTలకు SAగా విద్యాశాఖ పదోన్నతి కల్పించింది.DSC ద్వారా కొత్త ఉపాధ్యాయులను నియమించినా ఇంకా సుమారు 2 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. మరో DSCకి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

Similar News

News November 3, 2025

MBNR: ఈనెల 7న దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

image

జిల్లాలోని దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ఈ నెల 7వ తేదీన మహబూబ్‌నగర్ అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

News November 3, 2025

కురుమూర్తి జాతరలో ఆకతాయిల ఆగడాలు

image

కురుమూర్తి జాతరలో ఆకతాయిల దుశ్చర్యలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. భారీగా భక్తులు తరలివస్తుండగా కొందరు యువతులు, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకు మద్యం, మాంసం దుకాణాలు తెరిచి ఉండడంతో మత్తులో హంగామాలు సృష్టిస్తున్నారు. రద్దీని ఆసరాగా చేసుకుని జేబుదొంగలు మొబైల్ ఫోన్లు, ఆభరణాలు అపహరిస్తున్నారు. పోలీసులు నిఘా పెంచాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

News November 3, 2025

హన్వాడ: సదర్ ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉంది

image

యాదవులు జరుపుకునే సదర్ ఉత్సవాలకు గొప్ప చరిత్ర ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి హన్వాడ మండలం కేంద్రంలో సదర్ ఉత్సవాలలో పాల్గొన్నారు. ముందుగా శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటి వేడుకలు సాంస్కృతిక సంప్రదాయ పద్ధతులకు నిలయంగా నిలుస్తాయని గుర్తు చేశారు. అనంతరం దున్నపోతుల ప్రదర్శనను వీక్షించారు.