News September 8, 2024
కావలి: మత్తులో వ్యక్తి వీరంగం

కావలి ట్రంక్ రోడ్ అంబేడ్కర్ సర్కిల్ బ్రిడ్జి సెంటర్ వద్ద గంజాయి మత్తులో ఓ వ్యక్తి పోలీసుల ముందే వీరంగం సృష్టించాడు. దీంతో బ్రిడ్జి సెంటర్ వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచింది. పోలీసులు అతడిని పక్కకు పంపే ప్రయత్నం చేయగా.. వారిపైనే ఎదురు తిరిగాడు. కష్టం మీద పక్కనే ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మత్తు దిగిన తర్వాత సదరు వ్యక్తి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.
Similar News
News March 11, 2025
నెల్లూరు: నేటి నుంచి శనగల కొనుగోలు రిజిస్ట్రేషన్లు

నెల్లూరు జిల్లాలోని శనగ పంటను ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించేందుకు నేటి నుంచి 20వ తేదీ వరకు రైతు సేవా కేంద్రాల్లో రైతులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జేసీ కార్తీక్ తెలిపారు. ప్రభుత్వం శనగను రూ.5,650 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 11, 2025
నెల్లూరు: సరైన బిల్లులు లేని 4 కేజీల బంగారం స్వాధీనం

వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద జిల్లా విజిలెన్స్ ఎస్పీ రాజేంద్రకుమార్ ఆదేశాల మేరకు సీఐ కే.నరసింహారావు, DCTO కే. విష్ణు రావు తమ సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. సరైన బిల్లులు లేకుండా కారులో తరలిస్తున్న రూ.3 కోట్ల 37 లక్షల విలువైన 4 కేజీల 189 గ్రాములు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం, కారును జీఎస్టీ అధికారులకు అప్పగించారు.
News March 11, 2025
నెల్లూరు: కలెక్టరేట్‌లో ఉచితంగా భోజనాలు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో కలెక్టరేట్‌లో జరిగే PGRSకు ప్రజలు ప్రతి సోమవారం వస్తూ ఉంటారు. భోజన సమయం అయ్యేసరికి చేతిలో ఉండీ, లేక చాలామంది పస్తులు ఉంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన కలెక్టర్ ఆనంద్ అర్జీదారులకు ఉచితంగా భోజన వసతి ఏర్పాటు చేశారు. సమస్యలతో వచ్చే ప్రతి ఒక్కరూ కడుపునిండా భోజనం చేసేలా ఏర్పాట్లు చేసిన కలెక్టర్ ఆనంద్‌ను ప్రజలు అభినందిస్తున్నారు.