News September 8, 2024
అలాంటి వారిని సమాజం స్వీకరించదు: అజిత్ పవార్

కుటుంబంలో విభేదాలు సృష్టించేవారిని సమాజం ఇష్టపడదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ధర్మేంద్ర బాబాపై ఆయన కూతురు భాగ్యశ్రీ(NCP శరద్ వర్గం) పోటీ చేస్తారనే ప్రచారంపై అజిత్ స్పందించారు. కూతురు కన్నా తండ్రిని ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరని, తండ్రిపైనే పోటీ సరికాదని హితవు పలికారు. కాగా శరద్ పవార్‌తో తెగదెంపులు చేసుకొని షిండేతో అజిత్ పవార్ పొత్తు కలిసిన సంగతి తెలిసిందే.
Similar News
News October 31, 2025
కేంద్ర సాయం వెంటనే అందేలా చూడాలి: CBN

AP: రైతులు నష్టపోకుండా పంటలను నీటి ముంపు నుంచి కాపాడాలని CM CBN అధికారులను ఆదేశించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ముంపు ప్రాంతాలను గుర్తించి శనివారం నాటికల్లా నీటిని మళ్లించాలని సూచించారు. పంట నష్టం ప్రాథమిక అంచనాల్ని తక్షణం రూపొందించాలన్నారు. కేంద్ర బృందాల్ని రప్పించి, అక్కడి నుంచి సాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సహాయక చర్యల్లో బాగా పనిచేసిన 100 మందిని సత్కరించాలని చెప్పారు.
News October 31, 2025
శివమ్ దూబే ‘అన్‌బీటెన్’ రికార్డుకు బ్రేక్

2019 నుంచి ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టులో ఉన్న 37 T20Iల్లో భారత్ గెలిచింది. ఇవాళ ఆసీస్ చేతిలో ఓటమితో ఆ లాంగెస్ట్ అన్‌బీటెన్ రికార్డుకు బ్రేక్ పడింది. అలాగే 2021 నుంచి బుమ్రా ఆడిన 24 మ్యాచుల్లో టీమ్ ఇండియా గెలవగా ఇవాళ పరాజయం పాలయ్యింది. ఉగాండాకు చెందిన పస్కల్ మురుంగి(2022-24) 27*, మనీశ్ పాండే(2018-20) 20* రికార్డులు అలాగే ఉన్నాయి.
News October 31, 2025
హార్ట్ ఎటాక్‌ను నివారించే మందుకు FDA అనుమతి

హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించే Rybelsus మందుకు అమెరికన్ FDA ఆమోదం తెలిపింది. ఇది నోటితో తీసుకునే తొలి GLP-1 ఔషధం కావడం గమనార్హం. ప్రస్తుతం టైప్-2 డయాబెటిస్ రోగులు Rybelsusను వాడుతుండగా తాజాగా హృద్రోగులకూ విస్తరించారు. రక్తంలో చక్కెర స్థాయులు, ఆకలిని అదుపులో ఉంచడంతోపాటు గుండెపోటుకు ప్రధాన కారణాలైన రక్తనాళాల వాపు(ఆర్టీరియల్ ఇన్‌ఫ్లమేషన్), ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఇది తగ్గిస్తుంది.


