News September 8, 2024
తమిళగ వెట్రి కళగంకు ఈసీ గుర్తింపు

తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు దక్కింది. రిజిస్టర్డ్ పార్టీగా నమోదు చేసినట్టు ఆ పార్టీకి ECI కబురు పంపింది. ఫిబ్రవరిలో గుర్తింపు కోసం ఆ పార్టీ వర్గాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇటీవల జెండాను కూడా ఆవిష్కరించిన విజయ్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Similar News
News August 24, 2025
ఇక జిల్లాల్లోనే క్యాన్సర్ చికిత్స!

TG: క్యాన్సర్ మహమ్మారి చికిత్స కోసం HYDకు రాకుండా జిల్లాల్లోనే వైద్యం అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బోధనాస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. తక్షణమే 34 మెడికల్ కాలేజీల్లో 20 పడకల(10 కీమో, 10 పాలియేటివ్ కేర్) చొప్పున కేటాయించనుంది. ఇప్పటికే 27 సెంటర్లకు కేంద్రం రూ.40.23 కోట్లు నిధులు ఇవ్వగా మరో ఏడింటిని రాష్ట్ర నిధులతో సమకూర్చనున్నారు.
News August 24, 2025
మధ్యాహ్నం నిద్రపోతున్నారా: చాణక్య నీతి

మధ్యాహ్నం నిద్ర మేలు కాదని చాణక్య నీతి చెబుతోంది. దీంతో ఇతరుల కంటే పని తక్కువగా చేయడమే కాకుండా సమయం వృథా అవుతుంది. డబ్బు నష్టపోయే అవకాశముంది. జబ్బు చేసిన వారు, గర్భిణులు, చిన్నపిల్లల తల్లులు మాత్రమే నిద్ర పోవాలని అంటోంది. మధ్యాహ్నం నిద్రతో జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు కూడా చెబుతున్నారు. పవర్ న్యాప్(10-15 నిమిషాల నిద్ర)కు ఇది మినహాయింపు.
<<-se>>#chanakyaneeti<<>>
News August 24, 2025
యూఎస్ ఓపెన్.. ఎవరు సొంతం చేసుకుంటారో?

నేటి నుంచి యూఎస్ ఓపెన్(టెన్నిస్) మొదలు కానుంది. పురుషుల సింగిల్స్‌లో 25వ టైటిల్‌పై కన్నేసిన సీనియర్ ప్లేయర్ జకోవిచ్ వరుస పరాజయాలకు తెరదించుతారో చూడాలి. చివరి 3 టోర్నీల్లో సెమీస్‌లోనే జకో ఇంటిదారి పట్టారు. అటు యువ ప్లేయర్లు సిన్నర్, అల్కరాజ్ టైటిల్ ఫేవరెట్లుగా ఉన్నారు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో సబలెంకా, స్వైటెక్, కోకో గాఫ్ మధ్య పోరు నెలకొంది. వెటరన్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ కూడా బరిలో ఉన్నారు.