News September 8, 2024

31 సాకులతో రైతు రుణమాఫీకి కోతలు: హరీశ్

image

TG: రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ప్రభుత్వం 31 సాకులు చూపించిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. జాయింట్ ఫ్యామిలీ అని, సింగల్ ఫార్మర్ అని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, రెన్యూవల్ చేసుకోలేదంటూ వంటి కారణాలు చూపించారని మండిపడ్డారు. రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ మాట తప్పారని విమర్శించారు. ఆయన పాలనకు, చేతలకు పొంతన లేదన్నారు. ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ కావాలని కాంగ్రెస్ మంత్రులే చెప్పారన్నారు.

Similar News

News September 14, 2025

నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు

image

TG: నేడు రాష్ట్రంలోని 5 జిల్లాలకు వాతావరణశాఖ భారీ వర్షసూచన చేసింది. సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. నిన్న హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో వాన పడిన విషయం తెలిసిందే.

News September 14, 2025

నేటి నుంచి తిరుపతిలో మహిళా సాధికార సదస్సు

image

AP: తిరుపతిలో నేటి నుంచి 2రోజుల పాటు జాతీయ మహిళా సాధికార సదస్సు జరగనుంది. ప్రారంభోత్సవానికి CM చంద్రబాబు హాజరై ప్రసంగించనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో పాటు పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల మహిళా సాధికార కమిటీల సభ్యులు పాల్గొననున్నారు. ముగింపు కార్యక్రమానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. దేశ‌వ్యాప్తంగా 200 మందికి పైగా ప్రతినిధులు సదస్సుకు రానుండగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

News September 14, 2025

దాయాదితో నేడే పోరు.. ఆసక్తి కరవు!

image

భారత్-పాక్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచం మొత్తం అలర్ట్ అవుతుంది. టోర్నీ, వెన్యూ, ఫార్మాట్‌తో సంబంధంలేకుండా మ్యాచ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఫ్యాన్స్ ఎదురు చూస్తారు. ఆసియా కప్‌లో ఇవాళ టీమ్ ఇండియా-పాక్ తలపడుతున్నా ఎక్కడా ఆ ఉత్కంఠ లేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అంతా మారిపోయింది. దాయాది దేశంతో క్రికెట్ వద్దని అంతా వారిస్తున్నారు. బాయ్‌కాట్ ట్రెండ్ కూడా నడుస్తోంది. మరి మీరు ఇవాళ మ్యాచ్ చూస్తారా? COMMENT.